Begin typing your search above and press return to search.

రఘురామ వేరు విందులు.. వైసీపీకి దూరమేనా?

By:  Tupaki Desk   |   12 Dec 2019 11:46 AM IST
రఘురామ వేరు విందులు.. వైసీపీకి దూరమేనా?
X
వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో విందు రాజకీయం ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర దిగ్గజ ప్రతిపక్ష నేతలను ఆహ్వానించి గోదావరి వంటకాలను రుచిచూపించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్టులో ఈ భారీ విందు ఏర్పాటు చేశారు.

ఈ విందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి సహా కీలక పార్టీ ఎంపీలు హాజరయ్యారు. వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు విందులో పాల్గొన్నారు. మొత్తం 500 మంది పార్లమెంట్ ఎంపీలను రఘురామ రాజు పిలవగా.. 300 మంది హాజరైనట్టు తెలిసింది.

అయితే కొద్దిరోజులు వైసీపీకి దూరంగా సొంతంగా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణం రాజు తాజాగా కేంద్రంలోని బీజేపీకి దగ్గరవ్వడానికే ఈ విందు ఇచ్చారని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. పైకి సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్ష పదవి దక్కినందుకు అని చెబుతున్నా.. వెనుక బీజేపీ నేతలను మచ్చిక చేసుకునే వ్యూహమేనని అనుమానిస్తున్నాయి.రోజురోజుకు వైసీపీ దూరంగా బీజేపీ దగ్గరవుతున్న రఘురామ వైఖరి ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారుతోంది