Begin typing your search above and press return to search.
వైసీపీ జెండా మోయద్దురో... తిరగబడ్డ ఆడబిడ్డ
By: Tupaki Desk | 30 Nov 2022 11:44 AMవైసీపీని నమ్మొద్దురో.. ఆ పార్టీ జెండా పట్టద్దురో అంటూ ఒక మహిళా కార్యకర్త ప్రచారం చేయడం నిజంగా సంచలనమే. వైసీజీ జెండాను మోసి భుజాలు అరగదీయించుకున్న అనుభవం ఆ మహిళా కార్యకర్తది. అంతటి అభిమానం ప్రేమ ఏమయ్యాయి అంటే అంతా వైసీపీ నేతల పుణ్యామే అని ఆమె చెబుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపూర్ లో ఉన్న ఒక మహిళా వైసీపీ కార్యకర్త సునీత ఏకంగా అధికార పార్టీకే ఎదురు నిలిచారు. తనను నానా కష్టాల పాలు చేశారు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తాను జెండా మోసిన సేవలు చేసిన పాపానికి ఇలా చేస్తారా అంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఆమె వైసీపీ అధికారం రావడం కోసం తన వంతుగా యధాశక్తిగా కష్టపడ్డారు. తాను అంతలా పనిచేస్తే చివరికి తగిన ఫలంగా తన మీదనే కేసులు పెడతారా అని సునీత మండిపడుతున్నారు. తన వేదనను అంతా ఆమె వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదుటే మొరపెట్టుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎంపీడీవో ఆఫీసుకు వచ్చిన ఎమ్మెల్సీ ఇక్బాల్ ని చూసిన ఆ మహిళా కార్యకర్త తమ బాధ అంతా చెప్పుకున్నారు. తన గోడు విప్పి ఆవేదన ఎంత ఉందో చాటుకున్నారు. తాను వైసీపీ అభిమానిగా కార్యకర్తగా ఉన్నందువల్ల జరిగిన మేలు సంగతి పక్కన పెడితే పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు అని సునీత ఎమ్మెల్సీ ఎదుట వాపోయారు.
తనకు ఉన్న భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ పోలీసులే తన మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు బనాయించడం దారుణమని సునీత మండిపడ్డారు. ఆనాడు తాను వైసీపీ కోసం జెండా ఎత్తి మోస్తూ తిరిగితే ఈ రోజు తన మీదనే కేసులు పెట్టించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటువంటి వైసీపీని ఎవరూ నమ్మవద్దు జెండా పట్టవద్దు అని సునీత తన స్వీయ అనుభవంతో కఠిన స్వరంతో హెచ్చరిస్తున్నారు. దయచేసి చెబుతున్నా ఇక మీదట ఎవరూ వైసీపీ కోసం కష్టపడవద్దు అంటూ ఒక దండం పెట్టి మరీ ఆమె చెబుతున్నారు అంటే సునీతకు జరిగిన అన్యాయం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.
నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్యాడర్ ని సరిగ్గా చూసుకోవడం లేదన్న అతి పెద్ద ఫిర్యాదు ఉండనే ఉంది. దానికి తోడు అన్నట్లుగా తమ మానాన తాము బతుకులీడుస్తున్న కార్యకర్తల మీద కేసులు పెట్టడం వారి భూములు ఆస్తులు లాగాలని చూడడం అంటే దారుణాతిదారుణమే అంటున్నారు. ఇది ఇంతకు ముందు ఏ పార్టీ కార్యకర్తకూ జరిగినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. మరి దీని మీద వైసీపీ నాయకత్వం ఏ విధమైన ఆలోచనలు చేసి ఆంకు న్యాయం చేస్తుందో చూడాల్సి ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.