Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కి పట్టిన గతే వైసీపీకి కూడా... ?
By: Tupaki Desk | 19 Feb 2022 3:30 AM GMTఏపీలో కాంగ్రెస్ ఇపుడు ఎక్కడ ఉంది అంటే బూతద్దం తెచ్చి వెతుక్కోవాలి. అంతే కాదు, చరిత్రలోకి చూసుకోవాలి. దేశమంతా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఓడించినా ఆనాడు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కి పట్టం కట్టి పరువు నిలిపింది.
ఎన్టీయార్ లాంటి ప్రఖ్యాత సినీ నటుడి ప్రభంజనం బలంగా వీచినా కూడా అరవైకి తక్కువ కాకుండా సీట్లను 1983లో సాధించి. ఒక తడవ తరువాత అధికారం కూడా దక్కించుకుంది.
అలాంటి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒకే ఒక తప్పు ఉమ్మడి ఏపీని ఒక పద్ధతి ఏదీ లేకుండా విడగొట్టడం. అంతే తెలంగాణాలో కాళ్లూనుకోలేకపోతోంది. ఏపీలో ఉనికే మటుమాయం అయింది. అలాంటి కాంగ్రెస్ కి పట్టిన గతే వైసీపీకి ఏపీలో పడుతుంది అని మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి పెను శాపం పెట్టేశారు.
దానికి కారణం ఆయన కొత్త జిల్లాల కూర్పు మీద ఆగ్రహం చెందుతున్నారు. తనకు పట్టున్న సీట్లను పట్టుకుని మరీ వేరే కొత్త జిల్లాలో చేరుస్తారా అన్నదే ఆయన మండిపాటుకు కారణం. ఆనం ఇపుడు డైరెక్ట్ అయిపోయారు, పోతే పోయింది ఎమ్మెల్యే గిరి. మూడేళ్ళు అపుడే గడచిపోయాయి. ఇక తెగిస్తేనే మనుగడ అనుకుంటున్నారు.
అందుకే జగన్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదేనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే విధానమని నిలదీస్తున్నారు. ఉమ్మడి ఏపీ విడిపోతే నీటి కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. అవిపుడు జిల్లాల్లో కూడా జరుగుతాయి అని ఆనం జోస్యం చెప్పేశారు. ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కొత్త జిల్లాల విభజన ఉందని అంటున్నారు.
మొత్తానికి ఆనం వారు తన ఆవేశంలో చాలానే అనేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఒంటికాలి మీద లేచే జగన్ సొంత పార్టీ వైసీపీని అదే పార్టీతో పోల్చడం.
నిజంగా దీన్ని హై కమాండ్ ఎలా తీసుకుంటుందో. అంటే ఆనం తెగించేసే ఇలా అంటున్నారు అనుకోవాలి. మరి ఆయన బీకర గర్జనలకు, కోపాలకూ, శాపాలకు వైసీపీ నుంచి గట్టి రిటార్టు ఉంటుందా. వెయిట్ అండ్ సీ.