Begin typing your search above and press return to search.

వెల్లంప‌ల్లి దూకుడు త‌గ్గిందా.. త‌గ్గించారా..?

By:  Tupaki Desk   |   30 April 2023 11:18 AM GMT
వెల్లంప‌ల్లి దూకుడు త‌గ్గిందా.. త‌గ్గించారా..?
X
ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌తిప‌క్షం అంటే. చాలు.. ఒంటికాలిపై లేచేవారు. ఇక‌, రెండున్న రేళ్ల ప‌ద‌వీ కాలం త‌ర్వాత‌కూడా.. మంత్రిగా లేక‌పోయినా ఆయ‌న దూకుడు త‌గ్గించింది లేదు. పైగా ప్ర‌తిప‌క్షాల‌పైఆయ‌న కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. ఆయ‌నే విజ‌య‌వాడ‌కు చెందిన వైశ్య సామాజిక వ‌ర్గం నాయ‌కుడు వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు. అయితే.. ఇంత దూకుడు ఉన్న నాయ‌కుడు కూడా ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయారు. గ‌తంలో ఉన్న దూకుడు చూపించ‌డం లేదు.

వాస్త‌వానికి తెలంగాణ నుంచి అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంటును తామే కొంటామ‌ని.. బిడ్డింగ్‌లో ఉంటామ‌ని కూడా చెప్పారు. దీనిపై మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కౌంట‌ర్ ఇచ్చారు. ఇలాంటి విష‌యాల్లో వాస్త‌వానికి.. వెలంప‌ల్లి ముందుండే వారు. ఆయ‌న ముందుగా మాట్లాడేవారు. కానీ, ఈ సంద‌ర్భంలో ఆయ‌న స్పందించ‌లేదు. ఇక‌, జ‌న‌సేన‌పైనా ఆయ‌న దూకుడు చూపించేవారు. ప‌వ‌న్ ఏమ‌న్నా కూడా వెంట‌నేరియాక్ట్ అయ్యేవారు. కానీ, ఈ సారి మాత్రం ఆయ‌న సైలెంట్ అయ్యారు. మ‌రోవైపు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడిని నిత్యం విమ‌ర్శించేవారు.

కానీ, ఇప్పుడు అలా చేయ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. అధిష్టాన‌మే ఆయ‌న‌ను సైలెంట్ చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. మంత్రిగా ఉన్న‌ప్పుడు.. సొంత పార్టీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు ఆయ‌న‌కు ప‌డేది కాదు. పైగా.. విజ‌య‌వాడ వైసీపీ నాయ‌కుల్లోనూ ఆయ‌న‌కు ప‌డేది కాదు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌పై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అధిష్టానం.. అప్ప‌ట్లో మౌనంగా ఉన్నా.. కొన్నాళ్ల కింద‌ట‌.. కొంత త‌గ్గండి.. అని సూచించిన‌ట్టు ఎమ్మెల్యేల వ‌ర్గాల్లో చ‌ర్చ‌న‌డుస్తోంది. దీంతో వెల్లంప‌ల్లి దూకుడు త‌గ్గించార‌ని అంటున్నారు.

దీనికంటే కూడా.. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యంలో మంత్రి పెత్త‌నంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయి. మంత్రిగా దిగిపోయి నా.. కూడా ఆయ‌న హ‌వా ఏమాత్రం త‌గ్గ‌లేదు. దీంతో ఈ విష‌యంపై వైసీపీలోనే ఆయ‌న‌కు సెగ‌లు పుట్టించాయి. ఈ ప‌రిణామా ల‌పై సీరియ‌స్ అయిన‌.. పార్టీ అధిష్టానం.. కొంత క్లాస్ ఇచ్చింద‌ని.. అందుకే మాజీ మంత్రి దూకుడు త‌గ్గించార‌నే చ‌ర్చ సాగుతోంది . వ్య‌క్తిగ‌త అవినీతి ఆరోప‌ణ‌లు లేక‌పోయినా.. కొంద‌రి నుంచి క‌మీష‌న్లు తీసుకున్నార‌ని.. ఆయ‌న సోద‌రుడిపై మాత్రం ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే.. వీటిని పార్టీ ప‌ట్టించుకోలేదు. ఎటొచ్చీ.. దుర్గ‌గుడి.. ఎమ్మెల్యేల ఫిర్యాదుల నేప‌థ్యంలోనే మాజీ మంత్రిని సైలెంట్ చేశార‌ని అంటున్నారు.