Begin typing your search above and press return to search.
ఏపీలో ఎన్నికలు ఎపుడో హింట్ ఇచ్చిన వైసీపీ ఎంపీ!
By: Tupaki Desk | 10 July 2023 9:00 AM GMTఏపీలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు. డిసెంబర్ లో జరిగిపోతాయని అంటున్నారు. జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడల్లా ముందస్తు ఎన్నికల గురించే అడుగుతున్నారని కూడా అంటున్నారు. దాని మీద మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల క్రితం జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు కూడా ఇలాంటి ప్రచారమే సాగింది. దానికి వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఢిల్లీ నుంచే క్లారిటీ ఇచ్చారు.
తాము షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు. అంటే 2024 మే నెలలోనే ఎన్నికలు అని ఆయన వివరించారు. అయితే ఇపుడు అదే మిధున్ రెడ్డి మరికొంత క్లారిటీగా ఏపీలో ఎన్నికలు ఎపుడు అన్నది తేల్చి చెప్పారని అనుకోవాలి. ఆయన ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పాత మాటే చెప్పారు. అయితే దానికి కొత్తగా కొంత జోడించారు.
అదెలా అంటే లోక్ సభకు షెడ్యూల్ తో పాటే ఏపీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పడం విశేషం. అంటే ఏపీలో ఎన్నికలు ఎపుడు జరిగినా కేంద్రంతో పాటే అని చెప్పకనే చెప్పినట్లు అయింది. కేంద్ర ప్రభుత్వం ముందస్తు అని అంటోంది. అంటే ఈ ఏడాది డిసెంబర్ లో అయిదు రాష్ట్రాలతో పాటే లోక్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
దానికి తగినట్లుగానే ఏపీ కూడా ముందస్తుకు వెళ్తుంది అన్న మాటనే మిధున్ రెడ్డి చెప్పకుండా చెప్పారా అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్. అయిదు రాష్ట్రాలకు కాదు ఏకంగా పది పన్నెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు పెట్టించి తాము కూడా ఎన్నికల గోదాలోకి దిగిపోవాలని మోడీ సర్కార్ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
కేంద్రం ముందస్తుకు సై అంటే ఏపీ కూడా రెడీ అవుతుంది అన్న ఆలోచనతోనే మిధున్ రెడ్డి ఇలా చెప్పారని అంటున్నారు. అదే టైం లో కేంద్రంలోని ప్రభుత్వం ముందస్తు సన్నాహాల్లో ఉందన్న ఊహాగానాలకు మిధున్ రెడ్డి మాటలతో మరింత బలం చేకూరినట్లు అయింది అని అంటున్నారు.
విపక్షాలను దెబ్బ తీసి మూడవసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ముందస్తుకు వెళ్ళడం కంటే వేరే మార్గం లేదని కేంద్రం భావిస్తోంది అని అంటున్నారు. అలా తనతో పాటు ఏపీని ఒడిశా మహారాష్ట్రను కూడా వెంటబెట్టుకుని ముందస్తుకు సై అంటుంది అని అంటున్నారు. సో ఏపీలో ఎపుడు ఎన్నికలు అంటే ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అది మోడీ చేతిలో ఉంది అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.