Begin typing your search above and press return to search.
యానాం స్వతంత్ర అభ్యర్థి మిస్సింగ్ .. ఏం జరిగింది ?
By: Tupaki Desk | 2 April 2021 8:30 AMప్రస్తుతం దేశంలో మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో పుదుచ్చేరి రాష్ట్రం కూడా ఒకటి. అక్కడ అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకోని ప్రభుత్వం కూలిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే .. ఈ ఎన్నికల సమయంలో అక్కడ తీవ్ర కలకలం రేగింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్నపెమ్మాడి దుర్గా ప్రసాద్ అదృశ్యం అయ్యారు. గురువారం ఉదయం నుండి ఆయన ఆచూకీ తెలియలేదు. దీనితో అయన భార్య తన భర్త కనిపించట్లేదంటూ ఆయన భార్య పెమ్మాడి శాంతి యానాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉదయం 6 గంటలకు కొత్తపేట అన్యం గార్డెన్స్ లోని శ్రీనివాస అపార్ట్ మెంట్ లోని నివాసం నుంచి ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారని, అప్పటి నుంచి ఆయన మొబైల్ ఫోన్ స్విచాఫ్ లో ఉన్నట్లు ఆమె తన ఫిర్యాదులో పొందుపరిచారు.
ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న పెమ్మాడి దుర్గా ప్రసాద్ ఓ మత్స్య వ్యాపారి. ఆయనకు సొంతంగా ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. యానాం కొత్తపేటలో ఆయన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల గుర్తు.. గ్లాసు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. యానాం మత్స్యకార కుటుంబాల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకుపై గట్టి పట్టు ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీనితో గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం కోసమే గురువారం ఉదయం తన నివాసం నుంచి బయటికి వెళ్లిన ఆయన ఆచూకీ తెలియకుండా పోయారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పటి నుంచీ ఆయన మొబైల్ ఫోన్ స్విచాఫ్‌లో ఉన్నట్లు ఆయన భార్య శాంతి చెబుతున్నారు. పరిచయస్తుల కుటుంబాల్లో ఆరా తీసినప్పటికీ వారెవరు కూడా తమకు తెలియదంటూ బదులిచ్చారు. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆయన కోసం గాలిస్తున్నారు.