Begin typing your search above and press return to search.
వైసీపీ నాయకులారా మీకు దండం..నాకు అప్పులున్నాయి..నేను సంపాదించుకోవాలి ప్లీజ్: వైసీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 18 Sep 2020 8:45 AM GMT‘2014 ఎన్నికల నుంచి పార్టీ కోసం కష్టపడ్డా. ఎన్నికల్లో గెలుపు కోసం అప్పు చేశాను.. మీరు దయచేసి ఇప్పుడు పనులు అడగవద్దు. అప్పులు తీర్చుకోవాలి. నేను సంపాదించుకోవాలి.. అప్పులు తీరిన తర్వాత మీకు పనులు ఇస్తా.. అప్పటి వరకు నన్ను పనులు అడగవద్దు.. మీకు దండం పెడుతా’ అంటూ ఓ వైసీపీ ఎమ్మెల్యే వేడుకుంటున్నాడట.. ‘‘టీడీపీ వాళ్లు అయితే కమీషన్ ఇస్తారని.. అందుకే వాళ్లకు పనులు ఇస్తున్నా.. మీరు కూడా అర్థం చేసుకోండి. నేను కూడా జీవితంలో సెటిల్ కావాలి’’ అంటూ సదురు వైసీపీ ఎమ్మెల్యే తన కిందనున్న నేతలను బతిమిలాడుకుంటున్నాడని ఇప్పుడు ఓ నియోజకవర్గంలో కోడై కూస్తున్నారు..
వైసీపీ కార్యకర్తలు కూడా గత 10 ఏళ్ల నుంచి కష్టపడ్డారు. గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ల ఆధిపత్యంలో కేసులు పెట్టించుకున్నారు... తన్నించుకున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా కార్యకర్తలకు న్యాయం చేయకుండా ఉంటే ఆ పార్టీ ఎలా బాగు పడుతుందని అంటున్నారు. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ వాళ్లు బాగుపడి.. ఇప్పుడు వైసీపీ వచ్చినప్పుడు కూడా టీడీపీ వాళ్ల దగ్గరికి పోయి పనులు అడగాలా అని కార్యకర్తలు అంటున్నారట..
ఎమ్మెల్యేకు అప్పులు ఉంటే మేము బలికావాలా? అని వైసీపీ కింది స్థాయి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందే చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. మాతో పని చేయించుకున్నప్పుడు ఈ విషయం తెలియదా అని కౌంటర్ ఇస్తున్నారు. అప్పుడేమో ప్రభుత్వం అధికారంలోకి రాని.. అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి.. ఇప్పుడేమో టీడీపీ వాళ్ల కమీషన్ల కోసం మమ్మలను తొక్కేస్తారా అని వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..
మేము మిమ్మలను చూసి ఓట్లు వేయలేదని.. వైఎస్ఆర్ ను.. జగన్ సీఎం కావాలని ఓట్లు వేశాం కానీ ఈ ఎమ్మెల్యేను చూసి ఓట్లు వేయలేదని బహిరంగంగానే బట్టలు చింపుకొని వైసీపీ కార్యకర్తలు బాధలు పడుతున్నారట. గ్రామాల్లో ఈ మేరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఎమ్మెల్యే ఉంటాడని.. వచ్చే ఎన్నికల్లో మనం వేరే వాళ్లను చూసుకోవాలని.. ఇక్కడ చూసినా అదే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై అందరూ ఇదే డిస్కస్ చేస్తున్నారంట..