Begin typing your search above and press return to search.
దేశ చరిత్రలో మరో రికార్డ్ ..125 ఏళ్ల వ్యక్తి రెండు డోస్‌ల వ్యాక్సిన్
By: Tupaki Desk | 6 Nov 2021 9:40 AM GMTకరోనా మహమ్మారి నివారణ లో మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. కొవిడ్ నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని విస్తృతం చేస్తుంది. అయినప్పటికీ చాలామంది టీకా వేసుకోవడానికి ముందుకు రావడంలేదు. అయితే ఇక్కడ 125 ఏళ్ల వ్యక్తి రెండు టీకాలు వేసుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతడి పేరు స్వామి శివానంద్ బాబా. ఇతడు కొవిడ్ టీకా తీసుకున్న వారిలో అతి పెద్ద వయస్కుడు. 1896 ఆగస్టు 8 న బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ప్రాంతంలో జన్మించిన స్వామి శివానంద్ 1979 నుంచి వారణాసిలోని భేలపూర్ ప్రాంతంలో ఉంటున్నాడు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌కి వ్యతిరేకంగా పోరాడిన అత్యంత పెద్ద వ్యక్తి ఇతడే కావచ్చని అధికారులు భావిస్తున్నారు. సెంటర్ ఇన్‌చార్జి డాక్టర్ సరికా రాయ్ తన ఆధార్ కార్డును ఉపయోగించి అతడి వయస్సును ధృవీకరించారు.
భారత్ లో సుమారు 108 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు విజయవంతంగా ప్రజలకు ఇచ్చారు. వ్యాక్సిన్ కొరత తగ్గడం, అందరికీ అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ రేటు పెరుగుతోంది. అయితే ఇప్పటికీ కొందరు వ్యాక్సినేషన్ పై అభద్రతలోనే ఉంటున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోన్న భయాలతో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని వారు ఉన్నారు. అయితే తాజాగా వారనాసిలో చోటు చేసుకున్న ఈ సంఘటన మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ పై ఉన్న భయాలను పటాపంచలు చేసేసింది. జూన్ 9న తన తొలి డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాడు. ఇక తాజాగా దుర్గాకుండ్‌లో శివానందన్ విజయవంతంగా రెండో డోస్‌ను తీసుకున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే బహుశా ప్రపంచంలోనే ఇంత వయసున్న ఏకైక వ్యక్తి శివానంద్ కావొచ్చు. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత విలేకర్లతో మాట్లాడిన శివానంద్. తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పుకొచ్చాడు. ప్రతీరోజూ యోగా చేయడం, నూనె, మసాలాలు లేని ఆహారాన్ని తీసుకోవడం వల్లే తాను అంత ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ప్రజలందరు ఎటువంటి కారణం లేకుండా టీకాలు వేసుకోవడానికి భయపడు తున్నారన్నారు. అతడిని చూసి చాలామంది నేర్చుకోవాలన్నారు. అందరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు. గతంలో జలాన్ లోని వీర్పూర్ కుగ్రామానికి చెందిన రామ్ దులైయా వయసు 109 టీకా తీసుకున్న పెద్ద వయసురాలిగా ఉండేది. మొదటిది మార్చి 18 న, రెండవది ఏప్రిల్ 20 న తీసుకుంది. అయితే ఇప్పుడు స్వామి శివానంద్ బాబా ఆమె రికార్డ్ ను బ్రేక్ చేసేశాడు.