Begin typing your search above and press return to search.

చైనా అధ్యక్షుడిని డామినేట్ చేయనున్న ప్రణబ్

By:  Tupaki Desk   |   6 Nov 2016 9:45 AM GMT
చైనా అధ్యక్షుడిని  డామినేట్ చేయనున్న ప్రణబ్
X
రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ వేతనం పెంపు అంశం ప్రభుత్వం ప్రతిపాదనల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రస్తుత జీతమెంత... ప్రపంచంలోని మిగతా దేశాధ్యక్షుల వేతనాలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే ఆసక్తికరమే.

- ప్రణబ్ ప్రస్తుత వేతనం: నెలకు 1.5 లక్షల రూపాయలు

- కొత్తగా పెంచాలనుకుంటున్నది: రూ. 5 లక్షలు

- పెంపు శాతం: సుమారు 300 శాతం

ఎందుకు పెంచాలనుకుంటున్నారు..

రాష్ట్రపతి అంటే రాజ్యాంగపరంగా దేశంలోనే అత్యున్నత పదవి. గౌరవం పరంగా దేశంలో ఇంకెవరికీ ఆ స్థాయి గౌరవ మర్యాదలు దక్కవు. అయితే.. వేతనం విషయానికొచ్చేసరికి మాత్రం ప్రభుత్వ వేతనాల్లో రాష్ట్రపతి కంటే ఎక్కువ తీసుకునే వారుంటున్నారు.

ముఖ్యంగా ఏడో వేతన కమిషన్ సిఫారసుల అమలు తరువాత ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల వేతనాలు రాష్ట్రపతి కంటే పెరిగిపోయాయి. కేబినెట్ సెక్రటరీల జీతం నెలకు రూ.2.5 లక్షలకు చేరుకున్నాయి. ఇంకాచాలామంది జీతాలు ఈ స్థాయికి వచ్చేశాయి. దీంతో వారందరికంటే రాష్ట్రపతి జీతం ఎక్కువ ఉండాలన్న ఉద్దేశంతో పెంచేందుకు సిద్ధమవుతున్నారు.

మిగతాదేశాల్లో...

మన రాష్ట్రపతి జీతం 5 లక్షలకు పెంచినా కూడా ఇతర దేశాధ్యక్షులకు జీతాలకు ఏమాత్రం సరిపోలదు.

- అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జీతం ఏడాదికి రూ.2.5 కోట్లు. అంటే నెలకు రూ.2 కోట్లకుపైనే..

- జర్మనీ ఛాన్సులర్ ఏంజెలామెర్కెల్ జీతం ఏడాదికి రూ.1.7 కోట్లు

- బ్రిటన్ ప్రధాని థెరెసా మే రూ.1.2 కోట్లు

- రష్యా అధ్యక్షుడు పుతిన్ వేతనం రూ. 85 లక్షలు

- చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఏడాదికి రూ.53 లక్షల వేతనం.

- మన అధ్యక్షుడు ప్రణబ్ వేతనం నెలకు రూ.5లక్షలకు పెరిగి ఏడాదికి రూ.60 లక్షలకు చేరితే ఆయన కూడా దిగ్గజాల సరసన చేరుతారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/