Begin typing your search above and press return to search.
దుమారం: 74ఏళ్ల వయసులో పిల్లలా?
By: Tupaki Desk | 9 Sep 2019 7:36 AM GMTసైన్స్ అనేది ఒక అద్భుతం.. దాన్ని మంచికి వినియోగిస్తే లోక కళ్యాణం.. చెడుకు వినియోగిస్తే అదే లోక నాశనం.. దీన్ని మనం రోబో సినిమాలో చూశాం. చిట్టి రోబో మంచిగా ఉన్నప్పుడు ఎంతో మందిని కాపాడి.. చెడుగా మారాక చంపడం చూశాం. అది సినిమా అయినా వాస్తవంలోనూ అంతే.. ఇప్పుడు మన వైద్యులు చేసిన పనికి దేశవ్యాప్తంగా వైద్యసంఘాలు మండిపడుతున్నాయి. స్వయంగా ఇలా వైద్యశాస్త్రాన్ని దుర్వినియోగం చేసిన డాక్టర్ల తీరుపై ఇండియన్ ఫెర్టిలీటీ సొసైటీ క్షమాపణ చెప్పడం సంచలనంగా మారింది.
74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలవర్తిపాడుకు చెందిన మంగాయమ్మ వ్యవహారం మీడియాలో పతాకశీర్షికన వార్త అయ్యింది. సంచలనమైంది. అంత పెద్ద వయసులో కృత్రిమ గర్భాదరణ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై భారత వైద్య మండలిలో తీవ్రంగా రియాక్ట్అయ్యింది.
తాజాగా ఇండియన్ ఫెర్టిలిటీ సొసైటీ 74 ఏళ్ల వయసున్న మంగాయమ్మకు కృత్రిమ గర్భాదరణ చేసి పిల్లలు కనేలా చేసిన గుంటూరులోని అహల్య ఆస్పత్రి వైద్యులపై సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా అనైతిక చర్య అని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. సంచలనం కోసం చేసిన ఈ పని వైద్య వృత్తిని దుర్వినియోగం చేయడమేనని.. మహిళలు పిల్లలు కనే యంత్రం కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇక భారతీయ వైద్య మండలి అధ్యక్షుడు, ప్రముఖ వైద్యులు - నిపుణులు కూడా ఈ వృద్ధ దంపతులు పిల్లలు కనడాన్ని.. వైద్యులు ప్రోత్సహించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. ఎలాంటి విధానంలోనైనా సరే 50 ఏళ్లు దాటిన మహిళలు పిల్లల్ని కనడం అనేది సరైన విధానం కాదని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డెబ్బై ఏళ్ల వయసులో మధుమేహం - రక్తపోటు - గుండెజబ్బులు ఉంటాయని.. రక్తనాళాలు బలంగా లేకపోవడం వంటి వాటి వల్ల మహిళకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని.. ఇలా చేయడం ఎంతమాత్రం సేఫ్ కాదంటూ గుంటూరు వైద్యుల తీరుపై మండిపడుతున్నాయి.కాన్పు చేసిన వైద్యులపై చర్యలకు భారత వైద్య మండలి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.