Begin typing your search above and press return to search.
తల్లి బీరు తాగింది .. పసికందు కన్నుమూసింది !
By: Tupaki Desk | 31 July 2020 11:10 AM GMTమహిళకి ఉన్న తాగుడు వ్యసనంతో అమాయకమైన పసికందు మరణించింది. మహిళ మద్యం తాగడానికి , పసికందు మరణించడానికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా! మహిళ ఫుల్ గా బీర్ తాగి తన పాప పక్కన పడుకుంది. ఆమెకు ఆ పసిబిడ్డతో పాటు మరో 4 ఏళ్ల కూతురు కూడా ఉంది. తాగి వచ్చిన ఆ మహిళ పసిపాపకు పాలుపట్టి, డైపర్ మార్చి, తలుపులు అన్ని లాక్ చేసి జాగ్రత్తగానే బెడ్ పై పడుకుంది. కానీ తెల్లవారే సరికి ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పసికంద పెదాలన్ని నీలం రంగులోకి మారిపోయి కదలకుండా బెడ్ మీద ఉండటం హుటాహుటినా హాస్పిటల్ కి తీసుకుపోయింది. అయితే , ఆ పసిబిడ్డను పరీక్షించిన డాక్టర్లు పాప మరణించినట్లు తెలిపారు.
ఈ ఘటన మేరీ ల్యాండ్ లో జరిగింది. మేరీ ల్యాండ్‌కు చెందిన మురియెల్ మోరిసన్ అనే మహిళ వర్చువల్ పార్టీలో 2 బీర్ లు, కొంచెం మద్యం తాగింది. పార్టీ ముగిసిన తరువాత నాలుగేళ్ల చిన్నారితో పాటు నిదురిస్తున్న మరో పాపతో బెడ్ పై పడుకుంది. తెల్లవారేసరికి ఆ పాప మరణించింది. అయితే బీర్ వాసన వలన ఆ పసికందు మరణించిందని, ఆ తల్లి మద్యం సేవించడం కారణంగా పాపకు ఊపిరాడక మృతి చెందినట్లు ఆమె పై కేసు నమోదయ్యింది. ఈ కేసును విచారించిన కోర్టు తల్లి నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందనడానికి ఏం ఆధారాలు లేవని, అలాగే బీర్ వాసన వల్ల ఊపిరాడక మరణిస్తారు అని ఎక్కడ లేదని న్యాయమూర్తి తెలిపారు. దీంతో మోరిసన్ ను విడుదల చేశారు. అమెరికాల ప్రతి యేడాది కలిసి పడుకోవడం వలన 3,500 మందికి పైగా చిన్నారులు మరణిస్తున్నారు.