Begin typing your search above and press return to search.
ఈ బిచ్చగాడి ముచ్చట వింటే షాకే..!
By: Tupaki Desk | 7 Nov 2017 8:31 AM GMTరోడ్డు మీదకు వెళ్లినంతనే కనిపించే బిచ్చగాళ్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతుంటారు.కొందరు పాజిటివ్ గా.. నెగిటివ్ గా. ఆ మధ్యన రిలీజ్ అయిన బిచ్చగాడి సినిమా చూసినోళ్లంతా మాత్రం బిచ్చగాళ్ల మీద ఒక సానుకూల దృక్ఫదం ఏర్పడిందని చెప్పక తప్పదు. ఏమైదా బిచ్చగాళ్ల మీద దృక్ఫధాన్ని మార్చిన ఈ మూవీ మీద కనక వర్షం కురిసింది.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. చైనాకు చెందిన ఒక బిచ్చగాడి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క పూట అన్నం కోసం ఎదురుచూడటం.. చిట్టి కడుపు ఆకలి తీర్చేందుకు పడే తపన లాంటి మాటల్ని పక్కన పెడితే.. ఈ చైనా బిచ్చగాడి ఆదాయం ప్రతి నెలా జస్ట్ లక్ష రూపాయిలు మాత్రమేనట.
మన దగ్గర బిచ్చగాళ్లు రోజుకు రూ.300 నుంచి రూ.500 సంపాదిస్తుంటారన్నది ఒక అంచనా. గుళ్ల దగ్గర.. కొన్ని దర్శనీయ స్థలాల్లోనూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే వెయ్యి వరకూ సంపాదిస్తారని చెబుతుంటారు. ఇక.. చైనా బిచ్చగాడి విషయంలోకి వెళితే.. నెలకు లక్ష సంపాదించే ఇతగాడు.. తన సంపాదనను ఏం చేస్తున్నాడో తెలిస్తే మరింత ఆశ్చర్యపోవాల్సిందే.
అతగాడి పిల్లల్ని చక్కటి కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నాడట. ఇక.. డబ్బుల కుప్పను లెక్కేస్తున్న ఇతగాడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బిచ్చగాడికి ముగ్గురు పిల్లలట. తాను సంపాదించిన మొత్తాన్ని పిల్లల చదువు కోసం వెచ్చిస్తున్నాడట. అంతేకాదు.. తాను సంపాదించిన సంపాదనతో బీజింగ్ లో రెండస్తుల బిల్డింగ్ కూడా సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన సంపాదనను లెక్కేయటానికి వీలుగా కొందరిని సాయం అడుగుతాడట. వారికి కొంత మొత్తాన్ని ఇస్తాడట. ఏమైనా చైనా బిచ్చగాడే.. బిచ్చగాడు కదా?