Begin typing your search above and press return to search.
అమెరికా కంటే చైనాలో ట్రంప్ కు పాపులారిటీ
By: Tupaki Desk | 17 Nov 2016 7:30 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగింది మొదలు అధ్యక్షుడిగా ఎన్నికైన వరకు డొనాల్డ్ ట్రంప్ ప్రతిరోజూ సంచలనమే. ఆయన మాట్లాడితే సంచలనం.. ఆయన ముఖ కవళికలు - హావభావాలూ అన్నీ వివాదాలకు కేంద్ర బిందువులే. చివరకు ఆయన జుత్తుపైనా సందేహాలు - వివాదాలు రేగాయి. సహారా ఎడారిలో ఇసుక తిన్నెల్లా బంగారు రంగులో మెరిసిపోతూ గాలికి అలలుగా ఎగిరే ఆ జుత్తు 70 ఏళ్ల వృద్ధుడికి ఎలా ఉంటుందంటూ సందేహాలు వ్యక్తంచేశారు. అదంతా విగ్ అని... ట్రంప్ ప్రతి విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తారని.. వాస్తవవాది కాదని జుత్తుకు - వ్యక్తిత్వానికి ముడిపెట్టేశారు. ఎవరెన్ని అనుకున్నా ఏం చేసినా చివరకు ఆయనే అధ్యక్షుడయ్యారు. ఇదంతా ఒకెత్తయితే.. తాజాగా ట్రంప్ జుత్తు మరోసారి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ట్రంప్ హెయిర్ స్టైల్ చైనాలోని ఒక పక్షికి ఉండడంతో దాన్నిప్పుడు ట్రంప్ బర్డు అంటున్నారు.
చైనాలోని హంగ్ జోపు సఫారీ పార్కులో ఉన్న ఒక పక్షికి ట్రంప్ జుట్టును పోలిన జుట్టు ఉందట. దీంతో, ఈ పక్షి తెగ ఫేమస్ అయిపోయింది. ఇంకేముంది.. దానికి 'ట్రంప్ బర్డ్" అని పేరు పెట్టేశారు. దాన్ని చూసేందుకు జనం బారులు తీరుతున్నారట.
ట్రంప్ బర్డ్ అన్నది ఒక్కసారిగా పాపులర్ కావడంతో హంగ్ జోఫు సఫారీకి జనం తాకిడి పెరిగిపోయింది. ప్రజలు రావడం.. ట్రంప్ బర్డుతో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టడం కామన్ అయిపోయింది. మరి ట్రంప్ చైనాతో ఎలాంటి సంబంధాలు మెంటైన్ చేస్తారో కానీ చైనాలో మాత్రం ట్రంప్ ఇప్పుడు అమెరికాలో కంటే పాపులర్ అయిపోయారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/