Begin typing your search above and press return to search.

ఏపీలో తాళం తీయటంలో ఆరు దశలు?

By:  Tupaki Desk   |   13 May 2020 7:30 AM GMT
ఏపీలో తాళం తీయటంలో ఆరు దశలు?
X
లాక్ డౌన్ 3.0 కూడా పూర్తైనట్లే. 4.0కు రంగం సిద్ధమవుతోంది. ఇలాంటి వేళ.. లాక్ డౌన్ తాళాలు తీసేందుకు వీలుగా వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటూనే.. తీవ్రంగా ప్రభావితమైన రంగాల్ని ఆదుకునేందుకు వీలుగా ప్రయత్నాలు షురూ కావాల్సిన టైం వచ్చేసింది. లాక్ డౌన్ తాళాల్ని ఒక్కసారిగా తీయకుండా.. దశల వారీగా తీసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా ప్రధాని మోడీ ఇప్పటికే రాష్ట్రాలకు సూచన చేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దశల వారీగా తాళాలు తీసేందుకు వీలుగా ఆయా రాష్ట్రాలు వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ ను రెఢీ చేసింది. అందులో ఏయే రంగాలకు ఎలాంటి విధానాల్ని పాటించాలన్న అంశాల్ని పొందుపర్చినట్లుగా చెబుతున్నారు.

బ్లూ ప్రింట్ లో ఏ రంగాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వాలి? వేటికి ప్రాధాన్యత ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. మొత్తంగా ఆరు కమిటీలు.. ఆరు బ్లూ ప్రింట్ లు సిద్ధం చేసేందుకు వీలుగా సమాయుత్తం అవుతోంది. ఈ వివరాల్ని చూసినప్పుడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టే కార్యకలాపాలపై రెవెన్యూ ప్రత్యేక సీఎస్ నేతృత్వం లో కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి.. మన్సిపల్.. పట్టణాభివృద్ధి శాఖకార్యదర్శి సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో కార్యకలాపాలపై ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలు.. ప్రాథమిక రంగాలైన వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు వేర్వేరు కమిటీల్ని ఏర్పాటు చేస్తారు. ప్రజా రవాణాకు సంబంధించి మరో కమిటీతో పాటు.. ప్రభుత్వ.. ప్రైవేటు కార్యాలయాలు.. అన్ని సర్వీసులకు సంబందించి కార్యకలాపాల్ని ఏ రీతిలో పనులు ప్రారంభించాలన్న దానిపై మరో కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటారు.