Begin typing your search above and press return to search.
అద్దెకు బాయ్ ఫ్రెండ్.. ఎక్కడో కాదు బెంగళూరులోనే!
By: Tupaki Desk | 27 Sep 2022 4:25 AM GMTప్రాశ్చాత్య దేశాల్లో వినిపించే మాట.. రెండు తెలుగు రాష్ట్రాలకు దగ్గర్లో ఉన్న గార్డెన్ సిటీ బెంగళూరులో వినిపించటం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు హాట్ టాపిక్ గా మారింది. అవును.. అమ్మాయిలకు వారి అభిరుచి మేరకు గంటల చొప్పున అద్దెకు బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడన్న ప్రకటన ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి. దీనికి బెంగళూరుకు చెందిన కొందరు టెకీలు స్టార్ట్ చేసిన ఒక కొత్త స్టార్టప్ ఆసక్తికరంగా మారింది.
అయితే.. సదరు అమ్మాయి ఎంచుకున్న కుర్రాడు భౌతికంగా మాత్రం రాడు. ఇదెక్కడి ట్విస్టు అంటే అదే అసలు సంగతి. టామ్ బాయ్ పేరుతో స్టార్ట్ చేసిన ఒక పోర్టల్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఈ స్టార్టప్ అందించే సేవల గురించి స్పష్టత ఇస్తున్నారు దీని నిర్వాహకులు.
మానసిక సమస్యలు.. ఒంటరితనంతో బాధపడే వారికి సానుకూల వచనాలు చెప్పటం.. ధైర్యం ఇవ్వటం.. కౌన్సెలింగ్ చేయటానికి ఇప్పటికే చాలానే వెబ్ సైట్లు ఉన్నప్పటికీ.. తాము ఇచ్చే సేవలు వాటికి కాస్తంత భిన్నమని చెబుతున్నారు.
లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయిలకు తమ టాయ్ బాయ్ తో అందించే సేవలు సాంత్వన కలిగిస్తాయని చెబుతున్నారు. తమ పోర్టల్ ద్వారా అమ్మాయిల సమస్యలు సానుభూతితో వినటం.. వారి మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తామని చెబుతున్నారు.
అద్దెకు బాయ్ ఫ్రెండ్ అంటూ ఆకర్షణీయమైన ప్రకటనతో అందరిని ఆకర్షిస్తున్న ఈ స్టార్టప్ పై పలువురు మండిపడుతున్నారు. ఇదెక్కడి పోయేకాలం అంటూ తిట్టి పోస్తున్న వారు కూడా లేకపోలేదు. వివాదాస్పదంగా మారిన ఈ స్టార్టప్ పై కర్ణాటక ప్రభుత్వం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.