Begin typing your search above and press return to search.
పెళ్లికూతురు ప్రాణం తీసిన డీజే హోరు!
By: Tupaki Desk | 11 March 2018 4:38 AM GMTవినేందుకు విచిత్రంగా అనిపించింది ఈ విషాదం షాకింగ్ గా మారింది. పెళ్లి అంటేనే ఆ హడావుడి వేరుగా ఉంటుంది. భాజా భజంత్రీలు.. పెద్ద పెద్ద శబ్దాలు మామూలే. ఈ హడావుడి ఒక పెళ్లికుమార్తె ప్రాణాల మీదకు తెచ్చిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుడే పెళ్లి అయి.. ఊరేగింపుగా గుడికి వెళ్లి తిరిగి వస్తున్న ఆమె.. పెళ్లిలో భాగంగా ఏర్పాటు చేసిన డీజే శబ్దాలకు గుండెపోటుకు గురై కుప్పకూలిపోవటమే కాదు.. ప్రాణాలు విడిచిన విషాద ఘటన సూర్యపేటలో చోటు చేసుకుంది.
ఈ వైనం స్థానంకగా సంచలనం సృష్టించింది. సూర్యపేట శంకర్ విలాస్ సెంటర్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహించే హనుమయ్య కుమార్తె 23 గాయత్రికి వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన కుర్రాడితో పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా.. చుట్టాలు.. స్నేహితుల నడుమ పెళ్లి కార్యక్రమం పూర్తి అయ్యింది. భారీ సౌండ్ లో డీజే ఏర్పాటు చేసి కొత్త జంట ఊరేగింపు సాగుతోంది. గుడికి తీసుకెళ్లి.. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లే ఊరేగింపును భారీగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పూజను పూర్తి చేసుకొని గుడి నుంచి బయటకు వచ్చిన పెళ్లి కుమార్తె.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెనువెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లుగా తేల్చారు. భారీ శబ్దాలతో ఉన్న డీజేతో గుండెపోటు వచ్చిందని.. అదే ఆమె మరణానికి కారణంగా భావిస్తున్నారు. ఈ విషాదం ఇప్పడు సంచలనంగా మారింది.