Begin typing your search above and press return to search.
బస్టాండ్ లో తాళి కట్టిన మైనర్.. తర్వాతేమైందంటే?
By: Tupaki Desk | 11 Oct 2022 3:26 AM GMTబుద్ధిగా చదువుకోవాల్సిన వేళలో.. ప్రేమ.. పెళ్లి లాంటి మాటలతో పక్కదారి పట్టే పిల్లల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడులో ఇద్దరు మైనర్లు.. రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్ లో తాళి కట్టిన ఉదంతం వైరల్ గా మారింది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటిపెద్ద ఎత్తున సంచలనమైంది. స్టడీస్ మీద ఫోకస్ చేయాల్సిన వేళ.. అందుకు భిన్నంగా పెళ్లి మీద వారు చూపిన ఆసక్తిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.
తమిళనాడులోని చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహానికి సమీపంలో ఉన్న బస్టాండ్ లో మైనర్ బాలుడి పక్కనే కూర్చున్న మైనర్ బాలికను ఆ అబ్బాయి మెడలో తాళి కట్టటం.. ఆ సందర్భంగా ఆ మైనర్ బాలిక విపరీతంగా సిగ్గును ప్రదర్శిస్తున్న చిట్టి వీడియో వైరల్ గా మారింది. ఈ వివాహంపై పలువురు తీవ్రంగా తప్పు పట్టటంతో పాటు.. వారు చేసిన పని ఏమిటి? అన్న మండిపాటు వ్యక్తమవుతోంది.
బస్టాండ్ లో తాళి కట్టిన మైనర్ పాలిటెక్నిక్ చదువుతుంటే.. ఆ అమ్మాయి ఇంటర్ చదువుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ మైనర్ పెళ్లి ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏమిటి? కావాలనే చేశారా? ఫ్రాంక్ వీడియోలో భాగంగా చేశారా? అన్నది తెలీదు కానీ.. ఈ పెళ్లి చట్టవిరుద్దమని మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
మైనర్ అమ్మాయిని మైనర్ అబ్బాయి తాళి కట్టిన వేళ.. చుట్టూ (వీడియోలో కనిపించటం లేదు) ఉన్న వారంతా వారి పెళ్లిని సపోర్టు చేస్తున్నట్లుగా వారి మాటల్ని వింటే అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ గా మారటంతో చిదంబరం జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వీడియోలోని ఇద్దరు మైనర్ల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చిన్న వయసులో చదువు మీద కాకుండా ఇలాంటి పనుల మీద ఫోకస్ పెట్టిన ఈ ఇద్దరు మైనర్లపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.