Begin typing your search above and press return to search.

అస‌మ‌ర్థ రాజ్యంలో స‌మ‌ర్థ ముఖ్య‌మంత్రి ?

By:  Tupaki Desk   |   9 April 2022 11:30 AM GMT
అస‌మ‌ర్థ రాజ్యంలో స‌మ‌ర్థ ముఖ్య‌మంత్రి ?
X
ఇంత‌వ‌ర‌కూ ఉన్న‌వారంతా ఎవ‌రు ? ఇంత‌వ‌ర‌కూ ప‌ద‌వులు అంటూ హ‌డావుడి చేసిన వారంతా ఎవ‌రు? ప‌ద‌వులు లేక‌పోతే క‌న్నీళ్లే వ‌స్తాయి. ఉండ‌వ‌మ్మ ఉండ‌వ‌మ్మ చాన్నాళ్లు అని కూడా పాడుకోండి..గోరంత గూటికి చేరిన చిల‌క‌మ్మల‌ను.. అయ్య‌ల‌ను..మంత్రులు పాపం ఏడుస్తాండారు. అదే ప‌నిగా ఏడుస్తాండారు. ఇదిగో ఈ వీకెండ్ పార్టీ ఇచ్చి మ‌రీ ఏడ్చేందుకు సిద్ధం అవుతాండారు.

ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది. ఇంత‌వ‌ర‌కూ మీడ‌యాను కూడా తిట్టిపోశాం. ఆయ‌న తిట్ట‌మ‌న్నాడు క‌నుక తిట్టాం అని చెబుతున్నాడు నాని..ప్ర‌యివేటు సంభాష‌ణ‌ల్లో.. ఇదే మాట పాపం టీడీపీ కూడా అంటోంది. నానిని మా కొడాలి నానిని మా డీఎన్ఏ ఉన్న నానిని జ‌గ‌న్ వాడుకుని వ‌దిలేశాడు అని.. వ‌దిలేశాడు కానీ వెలివేశాడా కాదు క‌దా క‌నుక హాయిగా ఉండండి టీడీపీ నాయ‌కులు. ఇంత‌కూ మీ గోలేంటి నానికి ప‌ద‌వి లేదనా లేదా కొత్త బూతుల మంత్రిగా ఎవ‌రు వస్తారనా?

నిజంగానే నిజం చెప్పాడు కొడాలి నాని. ముఖ్య‌మంత్రి స‌మ‌ర్థుల కోసం వెతుకుతున్నాడ‌ని.. బాగుంది.ఆ ప‌ని ముందే చేయాల్సింది. కానీ శ్రీ‌కాకుళం జిల్లా అమ్మాయి కావ‌లి గ్రీష్మ మాత్రం మా నాని అన్న‌ని ఇంకా ఇత‌ర అన్న‌ల‌ను జ‌గ‌న్ అన్న వాడుకుని వ‌దిలేశాడ‌ని అంటున్నారు.

కావ‌లి గ్రీష్మ అంటే ఉమ్మ‌డి రాష్ట్రానికి శాస‌న స‌భాప‌తిగా ప‌నిచేసిన ప్ర‌తిభాభార‌తి కూతురు. టీడీపీ సోష‌ల్ మీడియా విభాగంలో యాక్టివ్ గా ఉంటారు. ఉమ్మ‌డి శ్రీ‌కాకుళం జిల్లా, రాజాం నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంఛార్జ్. అదేవిధంగా చాలా మందిని జ‌గన్ త‌న అవ‌స‌రం మేరకు వాడుకుని వ‌దిలేశాడ‌ని బుద్ధా వెంక‌న్న అనే మాజీ ఎమ్మెల్సీ కూడా బాధ‌ప‌డుతున్నాడు.

ఆయ‌న బాధేంటంటే కొత్త మంత్రులు ఎవ్వ‌ర‌యినా స‌రే వాళ్ల‌ను తిట్టాలంటే క‌నీసం ఓ ఆర్నెల్లు అయినా టైం ఇవ్వాలి. అంత టైం ఇస్తే పొలిటిక‌ల్ మైలేజీ పోతుంద‌ని..ఇదే మాట వైసీపీ అంటోంది. క‌నుక కొత్త మంత్రులు రాగానే తిట్ల దండ‌కం అందుకోకండి అని జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే టీడీపీకి సుద్ధులు చెబుతున్నాడు.

ప‌నిలో ప‌నిగా వారిని దెయ్యాలు భూతాలు అని కూడా అంటున్నాడు. అంటూనే నా వెంట్రుక కూడా పీక‌లేరు అని చెబుతున్నాడు. ఇదీ ఓ ముఖ్య‌మంత్రి మాట్లాడాల్సిన మాట..స‌మ‌ర్థ‌నీయం వైసీపీకి..ఆక్షేప‌ణీయం టీడీపీకి.. రాజ‌కీయం లో భాగం ఇదంతా జ‌నానికి.. ప్ర‌జానీకానికి..