Begin typing your search above and press return to search.
చంద్రుడి పై కార్ రేస్ పెట్టబోతున్న అమెరికా !
By: Tupaki Desk | 2 Dec 2020 12:45 PM GMTకార్ రేస్ .. సాధారణంగా రోడ్లు ఖాళీగా ఉన్న చోట, ఔటర్ రోడ్లలో జరుగుతుంటాయి. ఈ కార్ల రేసులకి అనుమతి అయితే ఉండదు కానీ, పోలిసుల కళ్లు గప్పి రేసులు నిర్వహిస్తుంటారు. ఇది సర్వసాధారణం అనుకున్నారేమో అమెరికా వారు అతి త్వరలో చందమామ పై కార్ల రేస్ నిర్వహించబోతున్నారు. చందమామ పై కార్ల రేస్ ఏంటి...మీకేమైనా పిచ్చా అనుకుంటే పొరపాటే...నిజమే త్వరలో చంద్రుడిపై కార్లను పంపనున్నారు. దీనికోసం అమెరికా హైస్కూల్ విద్యార్థులు రెండు కార్లను డిజైన్ చేయనున్నారు.
ఈ కార్లను రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించనున్నారు. భూమిమీద నుండే రిమోట్ ద్వారా అక్కడ కార్లను నడపనున్నారు. 2021 అక్టోబర్‌లో జాబిల్లిపైనా కార్ రేస్ కూడా నిర్వహించనున్నారట. మూన్ మార్క్ మిషన్–1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్ విద్యార్థులతో కార్లను డిజైన్ చేయించనున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్ మెషీన్స్ ల్యాండర్ ను వైఫైతో కనెక్ట్ చేయడం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో తెలిపారు. ఇక చంద్రుడి పైకి పంపే కార్లు సైజు చాలా చిన్నగా ఉండనుంది. ఒకొక్క కారు బరువు 2.5 కిలోలు ఉండనుంది. ఇలా రెండు కారులను పంపబోతున్నారు.
అలాగే చంద్రుడి పైన కార్లను దింపే వస్తువు బరువు 3 కిలోలుగా ఉండనుంది. మొత్తం రెండు కార్లు వాటిని దించేందుకు ఉపయోగించే ఒక వస్తువు మొత్తం 8 కిలోల బరువును చంద్రుడి పైకి పంపబోతున్నారు. అయితే ఈ ఎనిమిది కిలోల బరువు ఖర్చు మాత్రం భారీగానే ఉంది. వీటిని అక్కడికి తీసుకెళ్లేందుకు కనీసం రూ.73 కోట్లు ఖర్చు కానుందట. ముందుగా స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్–9 రాకెట్ ద్వారా ఇంట్యూటివ్ మెషీన్స్ అనే కంపెనీ తయారు చేసిన ‘నోవా–సీ’ ల్యాండర్ ద్వారా చంద్రుడి పైకి పంపనున్నారు. ఆ తర్వాత ‘నోవా–సీ’ ద్వారా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆతర్వాత కార్లను పంపనున్నారు. ఇక ఈ కార్ రేస్ ను లైవ్ లో ప్రసారం చేయాలని ఈ పోటీని నిర్వహిస్తున్న మూన్‌మార్క్ కంపెనీ భావిస్తోంది. అయితే ఈ కార్ రేస్ అసలు సాధ్యమేనా అని తెలియాలంటే వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే.