Begin typing your search above and press return to search.
ఏపీలో సంచలనం.. సొంత ఎస్పీ పైనే అట్రాసిటీ కేసు నమోదు చేసిన అనంత పోలీసులు!
By: Tupaki Desk | 31 Aug 2022 4:23 PM GMTఏపీలోనేకాదు.. దాదాపు.. దేశంలోనే తొలి సంచలన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. తమ జిల్లా ఎస్పీపై.. అక్కడి పోలీసులే కేసు నమోదు చేయడం.. అందునా.. అట్రాసిటీ కేసు పెట్టడం అనేది నిజంగానే సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇది.. రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. అనంతపురం జిల్లా ఎస్పీ.. ఫకీర ప్పపై అక్కడి పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సాయుధ దళాలకు చెందిన ఏఆర్ .. కానిస్టేబు ల్.. కె. ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
అదేసమయంలో జిల్లా అదనపు ఎస్పీ.. హనుమంతప్ప, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ మహబూబ్ బాషా లపై కూడా..ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం గమనార్హం. దీంతో పాటు.. ఐపీసీలోని 167, 177, 182 సెక్షన్‌ల ప్రకారం.. కూడా కేసు నమోదు చేశారు. ఇక, ఈ కేసులో ఎస్పీని విచారించేందుకు డీఐజీ ర్యాంకు అధికారి రంగంలోకి దిగుతారని.. టూటౌన్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శివరాముడు తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న సమయంలో ఎస్పీ ఫక్కీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కొద్దిసే పటి తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం సిఐ శివరాముడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై నమోదైన కేసుకు సంబంధించి, డీఐజీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని సీఐ వెల్లడించారు.
అసలు ఏం జరిగింది?
సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల కిందట జరిపిన అనంతపురం జిల్లా పర్యటన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులను కాపాడాలని.. వారికి రావాల్సిన.. జీతం బకాయిలు.. ఈఎల్స్ బకాయిలు ఇప్పించాలని కోరుతూ.. భానుప్రకాష్ ప్లకార్డు ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. మరుసటి రోజే.. పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేశారు.
అయితే.. ఆ తర్వాత.. ప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు. అది కూడా.. ఈ ఉద్యమంతో సంబంధం లేకుండా.. ఒక మహిళను డబ్బు తీసుకుని మోసం చేశారంటూ.. పాత కేసులను తిరగతోడి ప్రకాశ్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు భానుప్రకాష్ ఆరోపించారు. అయితే.. సదరు లక్ష్మి అనే మహిళ.. ఈ విషయంపై వెంటనే స్పందించారు. పోలీసులు బలవంతంగా తనతో సంతకాలు చేయించుకున్నారని చెప్పారు.
ఈ పరిణామంతో మీడియా ముందుకు వచ్చిన ప్రకాశ్.. మూడు రోజుల క్రితం.. జిల్లా ఎస్పీ ఫక్కీరప్పతోపా టు ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబాషాలతో పాటు మరికొందరిపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఫకీరప్ప.. మద్యం వ్యాపారం చేస్తున్నారని.. కర్ణాటకలోని బళ్లారిలో ఇల్లు కట్టుకుంటున్నారని.. ఇక్కడ నుంచిఅక్రమంగా ఇసుక, ఇనుము, సిమెంటు వంటివాటిని తరలిస్తున్నారని.. ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.