Begin typing your search above and press return to search.

శ్రీదేవి మరణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైదరాబాద్‌ లో ఫిర్యాదు

By:  Tupaki Desk   |   27 Feb 2018 3:29 PM GMT
శ్రీదేవి మరణంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైదరాబాద్‌ లో ఫిర్యాదు
X
శ్రీదేవి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హైదరాబాద్‌ కు చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. తెలంగాణ యూత్ ఫోర్స్ అనే సంస్థకు చెందిన కొందరు హైదరాబాద్‌ లోని సీబీఐ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

కాగా 54 ఏళ్ల శ్రీదేవి మరణంపై దుబయిలో అధికారులు విచారణ జరిపిన తరువాత ఆమె భౌతిక కాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అయితే.. ఆమె మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీబీఐ విచారణ జరపాలంటూ వీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

మరోవైపు శ్రీదేవి భౌతిక కాయానికి ఎంబామింగ్ ప్రక్రియ ముగిసింది. ఆమె బంధువులకు భౌతికకాయాన్ని అప్పగించారు. దీంతో శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ఆమె భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటల తర్వాత ఆమె భౌతికకాయం ముంబయి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన తారకి కడసారి వీడ్కోలు పలికేందుకు ముంబయిలోని ఆమె నివాసం వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాహ్నవి కపూర్ - ఖుషికపూర్‌ ఇంటి వద్దే ఉన్నారు. రేపు పవన్‌ హాన్స్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు.