Begin typing your search above and press return to search.
చైనా వ్యక్తి అంటించేశాడు: అతడి ద్వారా ఏడుగురికి పాజిటివ్
By: Tupaki Desk | 18 Jun 2020 5:30 PM GMTమహమ్మారి వైరస్ విజృంభణ మహారాష్ట్రలో తీవ్ర రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఈ ఒక్క రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. లక్ష 16 వేలకు పైగా కేసులు, ఐదున్నర వేలకు పైగా మరణాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే వైరస్ పుట్టి ప్రపంచవ్యాప్తంగా పాకేలా వైరస్ జన్మకు కారణం చైనా. ఆ దేశానికి చెందిన వ్యక్తి భారత్‌లో వైరస్ విజృంభణకు దోహదం చేశాడు. అతడి వలన ఏడు మందికి వైరస్ సోకడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పుణె జిల్లా చకన్ పట్టణంలోని ఓ చైనా విడిభాగాల సంస్థ కొనసాగుతోంది. ఆ కంపెనీలో పని చేస్తున్న ఆ చైనా వ్యక్తితో పాటు ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఖేడ్ తహసీల్దార్ డాక్టర్ బలరాం గడావే ప్రకటించారు.
చకన్ పట్టణంలో చైనా స్పేర్ పార్ట్స్ తయారీ సంస్థలో చైనాతో పాటు మహారాష్ట్రకు చెందిన ౩౦౦ మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో వైరస్ తీవ్రంగా ప్రబలుతుండడంతో ఈ కంపెనీలో కూడా వైరస్ పరీక్షలు జరిపారు. వైరస్ లక్షణాలు కనిపించిన ఓ వ్యక్తిని గత వారం పరీక్షించారు. ఈ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. మరో ఏడుగురికి వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ సోకిన వారిలో ఆరుగురు చైనా జాతీయులతో పాటు మరో 130 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వైరస్ బారినపడ్డ వారందరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.