Begin typing your search above and press return to search.
7 నెలల నరకం: బాలికపై 18 మంది రేప్
By: Tupaki Desk | 8 July 2018 5:58 AM GMTనోటితో చెప్పేందుకు సైతం మాట రాని పరిస్థితి. ఇలాంటి దారుణ ఉదంతం బిహార్ లోని చప్రాజిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంలో ఒక నిరుపేద బాలిక పట్ల వ్యవహరించిన వైఖరి ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఒక ప్రైవేటు స్కూల్లో చోటు చేసుకున్న అత్యాచార క్రమం ఏడు నెలలుగా సాగుతూ.. బాలికకు నరకం చూపిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక పట్ల స్కూల్లోని విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. చివరకు తండ్రి లాంటి ప్రిన్సిపల్ సైతం దారుణంగా వ్యవహరించి.. అఘాయిత్యానికి పాల్పడటం షాకింగ్ గా మారింది.
గత డిసెంబరులో చప్రా జిల్లాలోని పర్గాగఢ్ లోని ఒక ప్రైవేటు స్కూల్లో తొమ్మిది తరగతి చదువుతున్న బాలిక తండ్రి ఒక కేసు విషయంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. దీంతో కుంగిపోయిన ఆ బాలికను ఓదారుస్తున్నట్లు నటించి ఒక విద్యార్థి ఆమెను లొంగదీసుకున్నాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి స్కూల్ బాత్రూంలో ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీన్ని వీడియోలో రికార్డు చేసి.. తమ గురించి బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.
దీంతో మిన్నకుండిపోయిన ఆ బాలిక అసహాయతను అసరాగా చేసుకొని స్కూల్లోని పన్నెండు మంది విద్యార్థులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియో చూపిస్తామని బెదిరించటం ఆమెను రేప్ చేస్తున్న వైనాన్ని స్కూల్ టీచర్లు గుర్తించారు. వారు సైతం ఆమెను బెదిరించి లైంగికంగా దాడి చేశారు. ఈ వ్యవహారం తెలుసుకున్న ప్రిన్సిపల్ సైతం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఏడు నెలులుగా తాను అనుభవిస్తున్న నరకాన్ని జైలు నుంచి విడుదలైన తన తండ్రికి చెప్పుకున్న బాధిత బాలిక బోరుమంది. దీంతో.. ఆయన కుమార్తెను తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే.. కేసు నమోదు చేసేందుకు వెనుకాడటంతో.. ఉన్నతాధికారుల దృష్టికి ఈ దారుణాన్ని తీసుకెళతానని చెప్పటంతో వెనక్కి తగ్గిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఉదంతంతో సంబంధం ఉన్న 15 మంది విద్యార్థులు.. ఇద్దరు టీచర్లు.. ప్రిన్సిపల్ పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ప్రిన్సిపల్.. ఇద్దరు టీచర్లు.. ఇద్దరు విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.