Begin typing your search above and press return to search.
పది మందిలో ఒకడు.. ఇది తెలిస్తే కేసీఆర్ ఫుల్ హ్యాపీ
By: Tupaki Desk | 6 Nov 2021 4:24 AM GMTవెనుకా ముందు చూసుకోకుండా ఎంత మాట పడితే అంత మాట అనేసే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేతల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కుటుంబ సభ్యులను తన మాటలతో ఉతికి ఆరేసే ఆయన.. తాజాగా మరోసారి మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో.. బీజేపీ నేతల్లో హుషారు పెంచేలా చేసింది. మరి ముఖ్యంగా బండి సంజయ్ ఆనందానికి అడ్డే లేకుండా పోయింది. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో సాధించిన మరో విజయానికి ఆయన సంతోషంగా ఉంటున్నారు.
దీంతో ఆయన నోటి నుంచి వచ్చే మాటలు మరింత పదునుగా మారాయి. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ కేసీఆర్ సర్కారును తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. అనంతరం చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీని సందర్శించారు. అక్కడ వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ గోడును బండి సంజయ్ కు వెళ్లబోసుకున్నారు.
ఉద్యోగాలు ఏవని ఇంట్లో వాళ్లు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నట్లు వ్యాఖ్యానించిన పలువురు.. కేసీఆర్ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఉద్యోగం రాక తమకు పెళ్లిళ్లు కావట్లేదని కొందరు వాపోవటం గమనార్హం. రూ.5 భోజనంతో రోజూ కడుపు నింపుకుంటున్నామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాదిరి ఉద్యోగాలు రాని వారు పలువురు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారని.. కొందరు అరటిపండ్లను అమ్ముకుంటున్నారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ తీరు కారణంగా తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు వాపోయిన నిరుద్యోగులు.. కేసీఆర్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయటానికి వెనుకాడలేదు. అయితే.. బండితో మాట్లాడిన పది మంది విద్యార్థుల్లో తొమ్మిది మంది ఒకలా స్పందిస్తే.. ఒక్క వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు అయ్యారు. మిగిలిన వారి మాదిరి సీఎం కేసీఆర్ ను విమర్శించకపోవటమే కాదు.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నేసి మాటలు అనొద్దని వ్యాఖ్యానించటం గమనార్హం.
‘మా కేసీఆర్ సార్ ను తిట్టొద్దు’ అంటూ సదరు వ్యక్తి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మిగిలిన వారికి భిన్నంగా సదరు యువకుడు కేసీఆర్ పైన విమర్శలు చేసేందుకు ఒప్పుకోకపోవటమే కాదు.. మిగిలిన వారికి భిన్నంగా తన వాయిస్ ను వినిపించాడు. ఈ సంగతి తెలిస్తే.. సీఎం కేసీఆర్ ఖుషీ కావటం ఖాయమని చెప్పక తప్పదు. పది మందిలో ఒకరు ఓపెన్ గా.. మిగిలిన వారికి భిన్నంగా కేసీఆర్ పై విమర్శలు చేయొద్దన్న వైనం కమలనాథులకు కాసింత షాకింగ్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.