Begin typing your search above and press return to search.
ఆవు మూత్రంతో శానిటైజర్.. కరోనాకి చెక్ పెడుతుందా !
By: Tupaki Desk | 10 Sep 2020 2:30 PM GMTఆల్కహాల్‌తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్ కి చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ త్వరలోనే మార్కెట్‌లోకి రానున్నాయి. గుజరాత్ కు చెందిన ఓ సహకార సంస్థ ఆవు మూత్రంతో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్ ను తయారు చేసిందని, ఇది వచ్చే వారం మార్కెట్ లోకి రానుందని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. అహ్మదాబాద్ లోని జామ్ నగర్ లో మహిళల సహకార సంఘం, కామధేను దివ్య ఔషధి మహిళా మండలి సభ్యలు సంయుక్తంగా గో.. సేఫ్ బ్రాండ్ నేమ్ తో శానిటైజర్ ను విడుదల చేయడానికి సిద్ధమైంది. లాక్ డౌన్ సమయంలో ఈ సొసైటీ ఇప్పటికే రెండు గోమూత్ర ఆధారిత ఉత్పత్తులను ప్రారంభించింది. గో-ప్రొటెక్ట్ శానిటైజర్, గో-క్లీన్ అనే గది శుభ్రపరిచే మిశ్రమాన్ని తయారు చేసింది. గోమూత్రం తో హ్యాండ్ శానిటైజర్ వస్తున్నట్టు వార్తలు వెలువడిన మరుక్షణమే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు కూడా మొదలయ్యాయి. కరోనావైరస్ కి ఈ గోమూత్ర శానిటైజర్ చెక్ పెడుతుందా అని చాలామంది చర్చించుకుంటున్నారు.
దీనిపై కామధేను అర్థసేతు డైరెక్టర్ మనీషా షా మాట్లాడుతూ .. మేము ఎఫ్ డీసీఏ నుంచి గో-సేఫ్ బ్రాండ్ కోసం లైసెన్స్ పొందే ప్రక్రియలో ఉన్నాం. వారంలోపు లైసెన్స్ పొందాలని ఆశిస్తున్నాం అని అన్నారు. గోమూత్ర హ్యాండ్ శానిటైజర్ తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలను మేము బహిర్గతం చేయలేము. కాని వేప, తులసి వంటి సహజ మూలికలను ఇందులో ఉపయోగించాం. సమాజంలోని ఒక విభాగం గోమూత్రంలో ఉన్న ఔషధ విలువలపై పూర్తి నమ్మకంతో ఉంది. ఈ శానిటైజర్‌కు సానుకూల స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం అని మనీషా అన్నారు.