Begin typing your search above and press return to search.

మగ వ్యభిచారులు.. ఓ గే ఓనర్.. బయటపడ్డారిలా

By:  Tupaki Desk   |   8 Aug 2020 5:00 AM IST
మగ వ్యభిచారులు.. ఓ గే ఓనర్.. బయటపడ్డారిలా
X
శృంగారం కోసం ఓ కంపెనీ ఓనర్ ఇద్దరిని బుక్ చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ మగ గే యువకులు దొంగతనం చేశారు. కంపెనీ ఓనర్ పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరు మగ వ్యభిచారుల వ్యవహారం వెలుగుచూసింది. ఇది షాకింగ్ ఘటనగా మారింది.

ఓ కంపెనీ ఓనర్ గే. ఆ విషయం ఎవరికీ తెలియదు. అసహజ శృంగారం కోసం తమను బుక్ చేసుకున్నాడని ఇద్దరు యువకులు పోలీసులకు తెలిపారు.

ఢిల్లీకి చెందిన శంకర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ తన ఫ్లాట్ లో ఇద్దరు దొంగలు చోరీకి పాల్పడ్డారని తన రెండు మొబైల్ ఫోన్లు, రూ.42వేలు కాజేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు విచారించగా షాకింగ్ విషయం బయటపడింది. రవి, సునీల్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము మగ వ్యభిచారులమని.. శంకర్ తమ కస్టమర్ అని చెప్పడంతో ఆ కంపెనీ ఓనర్ ‘గే’ బాగోతం బట్టబయలైంది.

తమను శృంగారం కోసం బుక్ చేసుకొని పని అయిపోయాక డబ్బులు ఇవ్వకపోవడంతో చోరీ చేసినట్లు ఇద్దరు మగ వ్యభిచారులు రవి, సునీల్ చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. గతంలోనూ తమతో ఆ పనిచేయించుకొని బాకీ ఉన్నాడని.. అందుకే దొంగతనం చేసినట్లు వారు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.