Begin typing your search above and press return to search.
నేనే సీనియర్ రౌడీషీటర్...టికెట్ ఇవ్వాల్సిందే!
By: Tupaki Desk | 29 Oct 2018 10:36 AM GMTనేరచరిత్ర ఉన్న రాజకీయ నేతలు ఎన్నికల్లో పాల్గొనే అంశంపై ఓ వైపు చర్చోపచర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. క్రిమినల్ పొలిటిషియన్లను చట్టసభల్లో అడుగుపెట్టనీయకుండా చూడాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుతున్న విషయం విదితమే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఓ రాజకీయ నాయకుడు...తన నేర చరిత్ర ఆధారంగానే తనకు పార్టీ టికెట్ కేటాయించాలంటూ కోరుతున్న వైనం తెలిస్తే విస్తుపోవాల్సిందే. తనతో పాటు టికెట్ కు పోటీ పడుతోన్న మరో నేత కన్నా తానే సీనియర్ రౌడీ షీటర్ అని...అందుకే సీనియారిటీ ప్రకారం తనకే టికెట్ కేటాయించాలని ఆ నేత మీడియాముఖంగా అధిష్టానానికి అర్జీ పెట్టుకోవడం విశేషం. ఈ సీనియర్ రౌడీ షీటర్ కమ్ పొలిటిషియన్...రిక్వెస్ట్ కమ్ డిమాండ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ టికెట్ ను కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి ఆశిస్తున్నారు. మరో కాంగ్రస్ నేత రాఘవ రెడ్డి కూడా అదే టికెట్ ఆశిస్తున్నారు. దీంతో, తనకున్న సీనియారిటీని నిరూపించి...తనకే టికెట్ ఇవ్వాలని విలేకరుల సాక్షిగా సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, కాంగ్రెస్ పార్టీ కోసమే రౌడీ షీటర్ గా ఉన్నానని సుధీర్ అన్నారు. సీనియర్ రౌడీ షీటర్ ను తానేనని, నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది తానేనని చెప్పారు. రాఘవ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ సేవ చేయలేదని, కాబట్టి ఆ టికెట్ తనకే ఇవ్వాలని సుధీర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో ఈ వీడియో క్లిప్ హాట్ టాపిక్ అయింది. ఈ వీడియోను ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తో ఓ అభిమాని ట్విటర్ లో షేర్ చేశారు. దానికి కేటీఆర్...నవ్వుతున్న ఎమోజీతో రీట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇంత నిజాయితీకి తాను సీనియర్ రౌడీ షీటర్ అని ఒప్పుకున్నందకు అయినా....అతడికి టికెట్ ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంత బాహాటంగా తాను పార్టీ కోసం రౌడీషీటర్ గా మారానని చెబుతున్నారని, ఇటువంటి వారికి టికెట్ ఇస్తే రాజకీయాలు భ్రష్టుపట్టిపోతాయని మరికొందరు అంటున్నారు. భవిష్యత్తులో ....తమపై ఉన్న కేసుల చిట్టాను బట్టీ తమకే టికెట్లు ఇవ్వాలని మరికొందరు రాజకీయ నాయకులు అడిగినా ఆశ్చర్యం లేదని కామెంట్స్ చేస్తున్నారు. నేరచరిత్రే టికెట్ కేటాయింపులకు కొలమానం అయితే....చట్టసభలన్నీ నేరగాళ్లతో నిండిపోతాయని....అపుడు అసెంబ్లీలన్నీ జైళ్లను తలపిస్తాయని సెటైర్లు వేస్తున్నారు. పెను దుమారం రేపుతోన్న ఆ వీడియో నేపథ్యంలో సుధీర్ కు టికెట్ రావడం సంగతి దేవుడెరుగు......అతడిపై చర్యలు తీసుకోకుండా ఉంటే చాలని జోక్స్ వేస్తున్నారు.