Begin typing your search above and press return to search.

బెజవాడ లాడ్జిలో సూసైడ్ చేసుకున్న జంట బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   23 Dec 2019 5:21 AM GMT
బెజవాడ లాడ్జిలో సూసైడ్ చేసుకున్న జంట బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కే
X
రీల్ కు మించిన సిత్రాలు రియల్ లైఫ్ లో చాలానే చోటు చేసుకుంటాయి. ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా కాస్త ఘర్షణ జరిగినా.. దాదాపు రీల్ స్టోరీస్ ముగింపు సుఖాంతమే. కానీ.. రియల్ లైఫ్ లో అలాంటి పరిస్థితి చాలా తక్కువ. ఎక్కడిదాకానో ఎందుకు రెండు రోజుల క్రితం బెజవాడలోని ఒక లాడ్జిలో సూసైడ్ చేసుకున్న ఉదంతంలో ఒక అమ్మాయి మరణించటం.. అబ్బాయేమో కొనఊపిరితో ఉండటం తెలిసిందే.

ఈ ఉదంతం వెనుక అసలేమైందన్న విషయాన్ని తవ్వుతూ వెళితే.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. సూసైడ్ చేసుకున్న ఇద్దరిలో అమ్మాయికి 28 ఏళ్లు. ఆమెది గన్నవరం మండలం తెంపెల్లి గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించారు. లెక్చరర్ గా పని చేస్తోంది.

ఇక.. అబ్బాయి విషయానికి వస్తే గుడివాడకు చెందిన లోకేశ్. ఇతడు ఇప్పుడు పాలిటెక్నిక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంతకీ వీరిద్దరూ కలిసి సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నారన్న విషయంలోకి వెళితే.. లెక్చరర్ గా పని చేసే గౌతమికి.. అదే కాలేజీలో స్టూడెంట్ అయిన లోకేశ్ తో పరిచయం.. అది కాస్త ముదిరి ప్రేమగా మారింది.

ఇద్దరి మధ్య దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ ఉండటంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. నో అంటే నో అని చెప్పేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా గౌతమి గర్భవతి అయ్యింది. దీంతో వారి ఆందోళన మరింత పెరిగింది. తమ ప్రేమకు ఇంట్లో వారి చేత ఓకే చేయించుకోని తీరుతో.. ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వారిద్దరు విజయవాడకు వచ్చి ఒక హోటల్ బుక్ చేసుకున్నారు. తమ ప్రేమ గురించి.. పెళ్లి విషయంలో ఇంట్లో వారు నో చెప్పటంతో తాము సూసైడ్ చేసుకోవాలన్న విషయాన్ని గౌతమి తన డైరీలో పేర్కొంది.

ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో గౌతమి మరణిస్తే.. లోకేశ్ మాత్రం కొనఊపిరితో విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. రెండు కుటుంబాల్ని శోక సంద్రంలో ముంచేశాయి. లోకేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్లు.. కొంగొత్తగా వస్తున్న ప్రేమల విషయంలో పెద్దలు కొత్త తరహాలో ఆలోచించాలేమో?