Begin typing your search above and press return to search.

బార్డర్​లో పెళ్లి బాజాలు.. ఏం చేస్తాం మరి.. అంతా లాక్​డౌన్​ మహిమ!

By:  Tupaki Desk   |   17 Oct 2020 6:50 AM GMT
బార్డర్​లో పెళ్లి బాజాలు..  ఏం చేస్తాం మరి.. అంతా లాక్​డౌన్​ మహిమ!
X
అమెరికాకు చెందిన ఓ అబ్బాయి.. కెనడాకు చెందిన అమ్మాయి కరోనా లాక్​డౌన్​ విధించేందుకు కొన్ని రోజుల ముందు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ లాక్​డౌన్​తో వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. లాక్​డౌన్​ సడలించకపోతారా? పెళ్లి చేసుకోకపోతామా? అంటూ వేచి చూశారు. కానీ ఎన్ని రోజులైనా వీళ్ల ఆశలు నెరవేరే పరిస్థితి కనిపంచలేదు. అమెరికాలో అంతర్జాతీయ సరిహద్దుల విషయంలోనూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ జంట అమెరికా, కెనడా సరిహద్దుల్లో వివాహం చేసుకుంది. పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి కేవలం 30 మంది వచ్చారు. అమెరికా, కెనడా సరిహద్దుల్లో వివాహం చేసుకున్నాక ఎవరి దేశానికి వారు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనాతో ప్రపంచదేశాలన్ని ఇబ్బందులుఎదుర్కొంటున్నాయి. అన్ని కార్యక్రమాలు దాదాపుగా మారిపోయాయి. ఏ దేశంలోనైనా పెళ్లి అనేది ఓ వేడకలా సాగుతుంది. బంధువులు, మిత్రులతో వేడుక జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనాతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరోనా సమయంలో పెళ్లిళ్లు సింపుల్ గా కానిస్తున్నారు. ఇంకా కొన్ని దేశాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వేడుకలు ఘనంగా జరగకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. క్యాటరింగ్​ కేంద్రాలు, ఈవెంట్​ సంస్థలకు ప్రస్తుతం గిరాకీ లేదు. బ్యూటీషియన్లు, ఫొటోగ్రాఫర్లు కూడా నష్టపోతున్నారు. ఇలా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందోనని వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.