Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ‘సైబర్’ గేమ్

By:  Tupaki Desk   |   17 Sep 2022 2:30 AM GMT
సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ‘సైబర్’ గేమ్
X
అతడో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఐటీ సిటీ బెంగళూరు నుంచి 3 నెలల క్రితం హైదరాబాద్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ గా చేస్తున్నాడు. వారం రోజుల క్రితం సోషల్ మీడియా చూస్తుండగా ఒక ప్రకటన కనిపించింది. తక్కువ మొత్తంలో రీచార్జ్ చేయడం.. ఎక్కువ లాభాలు పొందండి అని దాని సారాంశం. దాంతో రీచార్జ్ చేసుకోవచ్చని మన సాఫ్ట్ వేర్ గురుడు ఆ ప్రకటనపై క్లిక్ చేశాడు. వెంటనే టెలీగ్రామ్ నుంచి అతడితో చర్చలు ప్రారంభమయ్యాయి. సంస్థ గురించి.. లాభాల గురించి విడమరిచి చెప్పి ఆకర్షించాడు.

దీంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఫోన్ నంబర్ తో ఖాతా తెరిచాడు. నలుగురు వ్యక్తులతో కలిపి అపరిచితుడు ఒక గ్రూప్ తయారు చేశాడు. మొదట 300 రూపాయలతో రీచార్జి చేశాడు. ఆ రోజు అతడికి లాభంతో కలిపి రూ.450 వచ్చినట్లు చూపించాడు. వెంటనే విత్ డ్రా కూడా చేసుకున్నాడు. వెంటనే రూ.5వేలు పెట్టుబడి పెట్టగా రూ.8వేలు వచ్చింది.

ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని.. లేదంటే వచ్చిన అవకాశం మిస్ అవుతుందని నష్టాల పాలు అవుతావని ఆ గ్రూప్ లో ఎంకరేజ్ చేశారు. వారి మాటలు నమ్మిన టెకీ వెంటనే వారం రోజుల్లోనే రూ.6 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. దాంతో లాభాలతో కలిపి రూ.12 లక్షలు వచ్చినట్టు చూపించాడు. వాటిని విత్ డ్రా చేసుకునేందుకు టెకీ ప్రయత్నించగా కాలేదు.

దీంతో ఆ గ్రూప్ లోని వారిని అడగ్గా రూ.10లక్షలు దాటితే విత్ డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందని.. రకరకాల రీచార్జులు చేస్తే మీ ఖాతాలో జమ అవుతాయని నమ్మించారు. దీంతో బాధితుడు మరో రూ7లక్షలు చెల్లించాడు.అయినా డబ్బులు విత్ డ్రా కాలేదు.

ఆన్ లైన్ లో దీనిపై ప్రశ్నించగా.. మరోసారి రీచార్జ్ చేస్తేనే డబ్బులు వస్తాయని నమ్మించారు. డౌట్ వచ్చిన టెకీ.. వెంటనే సైబరాబాద్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ గ్రూప్ ను... సభ్యులను ట్రేస్ చేయడానికి చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.