Begin typing your search above and press return to search.

ఇది తెలిస్తే.. మానవత్వం ఎంతలా చచ్చిందో తెలుస్తుంది

By:  Tupaki Desk   |   20 July 2020 6:16 PM GMT
ఇది తెలిస్తే.. మానవత్వం ఎంతలా చచ్చిందో తెలుస్తుంది
X
బతకటమే ముఖ్యమా? నిజమే.. బతకాలి. కానీ.. ఆ బతుక్కి ఒక అర్థం ఉండాలిగా? కంటికి కనిపించని మాయదారి వైరస్ మనుషుల మీద దాడి చేసి.. ప్రాణాల్ని తీసేస్తున్న వేళ.. మానవాళికి ఉండాల్సిన కనీసం దయ.. మానవత్వం లాంటివి మరుగున పడిపోయి.. ఎంతకూ తాము బతికితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును ఏమనాలి?

కరోనా వేళ.. ఎక్కడ మాయదారి వైరస్ అంటుతుందన్న భయంతో కొందరు వ్యవహరిస్తున్న తీరుకు మాటలు రాని దుస్థితి. వ్యవస్థలోని లోపాల్ని చెప్పటమే కాదు.. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అన్న ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి తీరుకు బ్రేకులు వేయాల్సిన అవసరం ఉంది. తాజాగా వరంగల్ లో కనిపించిన సీన్ చూస్తే.. కన్నీళ్లు ఆగవు.

వరంగల్ ఎంజీఎం ఆవరణలోని క్యాజువాలిటీ ముందు గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉంది. అదెవరిదో తెలీదు. దాన్ని అలా వదిలేసి.. ఆమె బంధువులు వెళ్లిపోయారు. విడి రోజుల్లో అయితే పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బతుకు భయం. అందుకే దాని దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి పని ఒత్తిడి అంటూ పట్టలేదు. దీంతో.. ఆ శవం స్ట్రెచ్చర్ మీద అలానే ఉండిపోయింది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. ఓవైపు వర్షం పడుతున్న వేళ.. మృతదేహం అలా తడుస్తున్నా ఎవరికి పట్టలేదు. కనీసం.. వర్షానికి తడవకుండా.. ఒక పక్కకు కూడా తీసుకెళ్లకుండా వదిలేశారు. దేవుడా.. ఇలాంటివి మరెన్ని చూడాలో..?