Begin typing your search above and press return to search.

ఆమె బరువులో సగం.. ఆమె కణితేనట.. ఇప్పుడెలా ఉన్నారు?

By:  Tupaki Desk   |   23 Aug 2020 5:45 AM GMT
ఆమె బరువులో సగం.. ఆమె కణితేనట.. ఇప్పుడెలా ఉన్నారు?
X
విన్నంతనే ఆశ్చర్యానికి గురి చేయటంతో పాటు.. భయాందోళనలకు గురి చేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఢిల్లీకి చెందిన ఒక మహిళ ఆరోగ్య సమస్యకు సంబంధించిన ఈ అంశం.. నిజంగానే జరిగిందా? అన్న భావనకు రావటం ఖాయం. 52 ఏళ్లఒక మహిళ తరచూ కడుపునొప్పికి గురయ్యేవారు. అదెంతలా పెరిగిందంటే.. నడవటానికి కూడా ఇబ్బంది పడేంత. దాదాపు 106కేజీల బరువు ఉండే ఆమె.. గడిచిన ఏడాదిలో భారీగా బరువు పెరిగిపోయారు. తనను వెంటాడుతున్న కడుపు నొప్పికి కారణం గురించి తెలుసుకున్న ఆమె అవాక్కు అయ్యారు. ఇంతకీ జరిగిందేమంటే?

ఢిల్లీకి చెందిన ఈ మహిళ ఏడాదిగా విపరీతంగా బరువుపెరుగుతున్నారు. దీనికి తోడు కడుపు నొప్పి.. సరిగా నిద్ర లేకపోవటం లాంటి సమస్యలు ఆమెను చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆమె నొప్పిని.. ఆరోగ్య సమస్యల్ని తట్టుకోలేక ఢిల్లీలోని ఇంద్రప్రస్థాన్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు జరిపిన వైద్యులు.. ఆమె అండశయంలో భారీ కణితి పెరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే.. దాన్ని తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అందుకు సరేనన్న ఆమెకు తాజాగా ఆపరేషన్ చేశారు. వైద్యులు సైతం ఊహించని రీతిలో ఆమె కడుపులో 50 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంలో సగభాగమైన ఆ కణితిని విజయవంతంగా తొలగించారు. దీంతో ఆమె బరువు ఏకంగా 56 కేజీలకు తగ్గిపోయారు. పలువురు వైద్యులు దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి.. ఈ కణితిని తొలగించారు.

ప్రపంచంలో ఇదే అతి పెద్ద కణితిగా వైద్యులు చెబుతున్నారు. శరీరంలో సగభాగం ఉన్న ఈ కణితను విజయవంతంగాతొలగించటం.. ప్రపంచంలో ఈ తరహా కేసులు చాలా అరుదుగా చెబుతున్నారు. గతంలో కోయంబత్తూరుకు చెందిన ఒక మహిళ కడుపులో 34 కేజీల కణితను తొలగించామని.. తాజాగా తొలగించిన కణిత అతి పెద్దదని వైద్యులు చెబుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె.. డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.