Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్ : కరోనాను అంతం చేసే పరికరం వచ్చేసింది !

By:  Tupaki Desk   |   28 July 2020 2:20 PM IST
గుడ్ న్యూస్ : కరోనాను అంతం చేసే పరికరం వచ్చేసింది !
X
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. త 24 గంటల్లో కొత్తగా 47704 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1483157కి చేరింది. అలాగే, గత 24 గంటల్లో 654 మంది చనిపోవడంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్యం 33425కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ప్రపంచమంతా యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే , కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతం సాధ్యం అవుతుందా , మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి అది సోకకుండా నివారించ‌వ‌చ్చా అనే అంశాల గురించి ర‌క‌ర‌కాల ప‌రిశోధ‌న‌లుజరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో క్లోజ్డ్ హాల్స్ లో క‌రోనా వైర‌స్ ను అంత‌మొందించ‌గ‌ల ఒక డివైజ్ ను తయారుచేసినట్టు బెంగ‌ళూరుకు చెందిన ఒక సంస్థ ప్ర‌క‌టించింది. ఈ డివైజ్ కు సంబంధించి అమెరిక‌న్, యూరోపియ‌న్ ల నుంచి అప్రూవ‌ల్ కూడా వ‌చ్చింద‌ట‌. త‌మ డివైజ్ తో గాలిలో వ్యాపించిన క‌రోనా వైర‌స్ ను 99.9 ప‌ర్సెంట్ వ‌ర‌కూ నాశ‌నం చేయ‌వ‌చ్చ‌ని ఆ సంస్థ చెబుతుంది. ఆ పరికరం పేరు Shycocan- Scalene Hypercharge Corona Canon, ఈ పరికరం ఓ చిన్న డ్ర‌మ్ మాదిరి ఉంటుంది. దీన్ని గ‌దుల్లోనూ, ఆఫీసుల్లోనూ, స్కూల్స్ లోనూ, ఎయిర్ పోర్ట్స్ లో, థియేట‌ర్ల‌లో..ఎక్క‌డైనా కాస్త క్లోజ్డ్ హాల్స్ లో బిగించుకోవ‌చ్చ‌ట‌. బిగించేస్తే చాలు అది వైరస్ ను అంతం చేస్తుందని చెప్పారు.

ఈ పరికరం గురించి వివ‌రిస్తూ.... క‌రోనా వైర‌స్ లో స్పైక్ ప్రొటీన్ లేదా ఎస్-ప్రొటీన్ ఉంటుంద‌ట‌, ఆ త‌ర‌హా వైర‌స్ ను ఈ యంత్రం నాశ‌నం చేస్తుంద‌ని దీని త‌యారీదారులు చెబుతున్నారు. ఇప్ప‌టికే దీని ప‌నితీరును యూఎస్ ఎఫ్డీయే ఆమోదించింది, ఈయూ నుంచి కూడా ఆమోదం ల‌భించింద‌ని, తాము రూపొందించిన ఈ డివైజ్ ను అంత‌ర్జాతీయ స్థాయిలో త‌యారీకి తామే లైసెన్స్ లు ఇస్తున్న‌ట్టుగా త‌యారీదారులు చెప్తున్నారు.ఈ పరికరం ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అని , 26 ర‌కాల ప‌రీక్ష‌ల్లో ఇది విజ‌య‌వంతం అయ్యింద‌ని, దేశంలో ప‌లు సంస్థ‌లు దీని తయారుచేయడానికి సిద్ధంగా ఉన్నాయ‌ని, మూడు సంస్థ‌లు లైసెన్స్ కూడా పొందాయ‌ని సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి పరికరాలు చాలా ఉపయోగపడతాయి.