Begin typing your search above and press return to search.
ఇది కదా.. సెగంటే వైసీపీలో గుసగుస...!
By: Tupaki Desk | 28 Dec 2022 11:30 AM GMTఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ, ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ మద్దతు దారులకు ప్రజలు పట్టం కట్టారు. అయితే, నిధులు ఇవ్వకుండా పాలక పార్టీ పంచాయతీల ను ఎండగడుతోంది.
పోనీ.. కేంద్రం ఇస్తున్న నిధులు అయినా.. ఇస్తోందో అంటేదొడ్డిదారిలో వాడేసుకుంటోందని సర్పంచులు రోడ్డున పడుతున్నారు. తాజాగా టీడీపీ మద్దతు దారుగా ఉన్న ఓ సర్పంచ్(పార్టీ ఏదైనా గ్రామానికి లీడరే కదా)కంచం పట్టుకుని బిక్షాటన చేసే పరిస్థితి వచ్చింది.
నిధులు లేక..నానా అగచాట్లు పడుతున్నామని ఆయన వాపోతున్నారు. అంతేకాదు.. తమపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఓటేసిన ప్రజలకు ఆయన క్షమాపణలు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం ఒమ్మెవరం సర్పంచ్ ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ, తన పరిస్థితిని వివరిస్తున్నాడు. కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం వాడేసుకోవడంతో పనులు చేసేందుకు డబ్బులు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దుస్థితి చూశాక వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.తమ వారు కూడా ఇవే ఇబ్బందులు పడుతున్నారని.. క్షేత్రస్థాయిలో సెగ పెడుతున్న ఇలాంటి సంగతులపై దృష్టి పెట్టకపోతే.. ఇబ్బందులు తప్పవని అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పంచాయతీ స్థాయిలో సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యతిరేక సెంటిమెంటు పుంజుకుంటే ఇబ్బంది తప్పదని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.