Begin typing your search above and press return to search.

చాటింగ్ కోసం వైద్యుడి ఆరాటం.. రూ.40 లక్షలు లాగేశారు

By:  Tupaki Desk   |   10 Oct 2020 9:30 AM GMT
చాటింగ్ కోసం వైద్యుడి ఆరాటం.. రూ.40 లక్షలు లాగేశారు
X
ఆయనో వైద్యుడు. వయసు యాభైకి పైనే.ఈ వయసులో ఆయనకు ఎందుకో కొత్త అనుభవాల కోసం తపించారు. అంతే.. డేటింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకున్నాడు. పెద్ద వయసులో వేటగాడిగా మారిన ఇతగాడి వేట ఫలించింది. ముగ్గురు యువతులు రోజు రాత్రిళ్లు మాట్లాడేవారు. రోజుకో రకంగా కవ్వించేవారు. తన సుడి తిరిగిపోయిందని సంతోషించాడే కానీ.. వారి వలపు ట్రాప్ లో తాను చిక్కుకున్నానని మాత్రం గ్రహించలేకపోయారు.

వీడియో కాల్ తో మాట్లాడేవారు.. పనిలో పనిగా బెడ్రూంలో ఉన్నానని ఊరించేవారు. ఎందుకింత ఆలస్యం.. హైదరాబాద్ వచ్చేయ్ అంటూ ఊరించేవారు. పనిలో పనిగా అసలు విషయాన్ని అప్పుడప్పుడు ప్రస్తావించేవారు. తమ దగ్గర అదిరిపోయే ప్లాన్లు ఉన్నాయని.. వాటిల్లో పెట్టుబడి పెడితే లాభాలే లాభాలని చెప్పేవారు. పెట్టిన పెట్టుబడికి భారీ వడ్డీ ఇస్తామన్న ఆశ పెట్టారు.

దీంతో.. ఆ వగలాడుల ఉచ్చులో పడిన వైద్యుడు అమాయకంగా రూ.41 లక్షల మొత్తాన్ని విడతల వారీగా పంపారు. డబ్బులు పంపటమే కానీ తిరిగి రావటం మానేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల కాలంలో సదరు వైద్యుడిలో వచ్చిన మార్పును గుర్తించిన ఇంట్లోని వారు.. అసలు విషయాన్ని గ్రహించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కిలేడీల మోజులో అప్పులు తెచ్చి మరీ డబ్బులు పంపాడు.

డబ్బులు పంపిన తర్వాత నుంచి స్పందన లేకపోవటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన ఈ గుజరాత్ డాక్టర్ హైదరాబాద్ కు వచ్చారు. సైబర్ పోలీసుల్ని కలిసిన ఆయన.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వారికి చెప్పి వాపోయారు. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. ఫిర్యాదు తీసుకొని కిలేడీల కోసం గాలింపు షురూ చేశారు.