Begin typing your search above and press return to search.

అలాంటి వాళ్లంతా మానవ బాంబార్లే

By:  Tupaki Desk   |   11 Aug 2015 4:42 AM GMT
అలాంటి వాళ్లంతా మానవ బాంబార్లే
X
పూటుగా తాగేయటం.. బాధ్యతారాహిత్యంగా బళ్లు డ్రైవ్ చేయటం చాలామందికి అలవాటే. తమ మీద తమకున్న మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కొందరు.. నిర్లక్ష్యంతో మరికొందరు డ్రైవింగ్ చేసి చాలా ప్రమాదాలకు కారణం అవుతుంటారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మద్యం సేవించి వాహానాన్ని నడపటం అన్న విషయం తెలిసినా పెద్దగా పట్టని జనాల పుణ్యమా అని దేశవ్యాప్తంగా భారీగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇదే అంశంపై ఢిల్లీ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాగి డ్రైవింగ్ చేసే వ్యక్తి మానవ బాంబర్ తో సమానమని.. తనతో పాటు మరికొందరి మరణించేందుకు కూడా అతడు కారణం అవుతాడని అభిప్రాయపడింది. బాధ్యతారాహిత్యంతో అలా చేసే వారికి కఠిన శిక్షలు విధించాల్సిందేనని పేర్కొంది. ఇలాంటి నేరాల్లో కఠిన శిక్షలు విధించటం ద్వారా నేరాల తీవ్రతను తగ్గించే వీలుందని వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ కు చెందిన ట్రక్ డ్రైవర్ రామ్.. తాగి వాహనాన్ని నడిపిన కేసులో.. అతనికి 20 రోజుల జైలుశిక్షను విధించారు. తనకు విధించిన శిక్షను రద్దు చేయాల్సిందిగా కోరుతూ పిటీషన్ దాఖలు చేసి.. తాను మొదటిసారి ఇలాంటి తప్పు చేశానని.. తనకు విధించిన శిక్షను రద్దు చేయాల్సిందిగా కోరాడు. ఈ నేపథ్యంలో అతడికి విధించిన శిక్షను 20 రోజుల నుంచి 5 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా.. కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది.