Begin typing your search above and press return to search.
ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు
By: Tupaki Desk | 17 Aug 2020 3:30 PM GMTబీజేపీకి.. దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కు దేశంలో ఫేస్ బుక్, వాట్సాప్ లు వంతపడుతున్నాయని తాజాగా అమెరికన్ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. రాహుల్ గాంధీ ట్వీట్ చేసి కడిగేశారు. ఫేస్ బుక్ ను నిందించారు. దీంతో రాజకీయంగా వేడి పుట్టింది.
ఈ క్రమంలోనే తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ ఢిల్లీలోని ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ తాజాగా పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు.
49 ఏళ్ల అంకిదాస్ ఈ వ్యవహారం వివాదాస్పదం అయిన తరువాత తనకు ఆన్ లైన్ ద్వారా.. ఫోన్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయని.. వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులను కోరారు.
తనకు ఐదుగురు వ్యక్తుల నుంచి బెదిరింపులు అందుతున్నాయని.. వెంటనే అరెస్ట్ చేయాలని ఫేస్ బుక్ ప్రతినిధి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆన్ లైన్ అకౌంట్ల ద్వారా వీరు బెదిరిస్తున్నారని విన్నవించింది. వాల్ స్ట్రీట్ కథనాన్ని తప్పుగా అర్థం చేసుకొని వక్రీకరించారని ఆమె ఆరోపించారు.