Begin typing your search above and press return to search.
వీళ్ళకేమైంది..కుళ్ళిన శవంతో 4 రోజులపాటు ఇంట్లో..
By: Tupaki Desk | 11 Oct 2020 12:30 AM GMTఇటువంటి మనుషులు కూడా ఉంటారని బహుశా ఎవరూ ఊహించరేమే! ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి చనిపోయి నాలుగు రోజులైనా కుటంబంలోని వాళ్లేవరూ స్పందించలేదు. యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. శవం కుళ్లిపోయి వాసన వస్తున్నా పట్టించుకోకుండా.. కనీసం ఎవరికీ చెప్పకుండా వదిలేశారు. కాగా వారి మానసిక ప్రవర్తన బాగోలేక పోవడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. చివరకు ఆ ఇంట్లో నుంచి భరించలేని వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళ ఎలా చనిపోయింది. ఆ ఇంట్లోని మనుషులు ఎందుకలా ఉన్నారో అర్థం కాక పోలీసులు తలలు పీక్కుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి ఆదిత్య నగర్ కాలనీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పోలాకి సత్యనారాయణ అనే వ్యక్తి ఇరిగేషన్ శాఖలో అటెండర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. . ఆయనకు 60 సంవత్సరాల వయసున్న భార్య ఈశ్వరమ్మ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్య నగర్ కాలనీ లోని తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. అయితే వీళ్లు ఎవరితోనూ మాట్లాడరని.. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటారని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. సత్యనారాయణ మాత్రం అప్పుడప్పుడూ బయటకు వెళ్లి సరుకులు తెస్తూ ఉండేవాడని సమాచారం.
వాళ్లది సొంతిళ్లు కావడంతో చుట్టుపక్కల వాళ్లు ఎవరూ అటువైపు వచ్చేవారు కాదు. ఇటీవల సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ చనిపోయింది. ఆమె ఎలా చనిపోయిందో తెలియదు. ఆమె చనిపోయిందన్న విషయం తెలిసి కూడా ఇంట్లో వాళ్లు పట్టించుకోలేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లారు. వాళ్లకు మంచం మీద కుళ్లిపోయిన శవం కనిపించింది. అయితే కుటుంబసభ్యుల్లో మాత్రం ఏం చలనం లేదు. దీంతో పోలీసులు రెడ్‌క్రాస్ సొసైటీ సహాయంతో ఆ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ మహిళ తిండిలేక చనిపోయినట్టు సమాచారం. కుటుంబసభ్యులు ఎందుకు అలా పట్టించుకోకుండా శవం మధ్యనే ఉన్నారో? వారికి మతిస్థిమితం సరిగ్గా లేదో అనేది పోలీసులకు అర్థం కావడం లేదు. చివరికి పోలీసులు ఆ ఇంట్లో వాళ్లందరినీ కూడా మానసిక వైద్యశాలకు తరలించారు.