Begin typing your search above and press return to search.
కూతురికి తనవల్లే కరోనా సోకిందని ఓ తండ్రి ఎంత పనిచేసాడంటే ?
By: Tupaki Desk | 25 July 2020 1:00 PM GMTకరోనావైరస్.. దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ, ఎన్నో కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తుంది. అప్పటివరకు ఎంతో ఆపాయ్యంగా ఉన్న కుటుంబాల్లో కరోనా దూరి అతలాకుతలం చేస్తుంది. తాజాగా మరో కుటుంబం కరోనా కాటుకి బలైంది. తన వల్లే రెండు నెలల గర్భిణీ అయిన కూతురికి కరోనా సోకిందేమో అన్న ఆవేదనతో ఓ తండ్రి ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... రాజమహేంద్రవరం మోరంపూడి చైతన్య నగర్ కు చెందిన 57 ఏళ్ల ఓ జట్టు కూలీ రంభ ఊర్వసి సెంటర్ ఉల్లిపాయల మార్కెట్ లో పనిచేస్తున్నాడు. చాలా కాలం క్రితమే శ్రీకాకుళం జిల్లా నుండి రాజమహేంద్రవరం వచ్చి, ఇక్కడ స్థిరపడి ఇల్లు కట్టుకుని పిల్లల్ని బాగా చదివించుకొని బాగా స్థిరపడ్డాడు. అయినా జట్టు పని మానకుండా వెళ్లి వస్తున్నాడు. అతడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు అంటే అతడికి చాలా ఇష్టం. ఆమె రెండు నెలల గర్భిణీ. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తన వల్లె కుమార్తెకూ కరోనా వచ్చిందని ఆవేదన తో గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రైలు పెట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఆధార్ కార్డు ఆధారంగా అతడిని గుర్తించారు. అయితే , ఇంకా ఆయనకి కరోనా సోకినట్టు నిర్దారణ కాలేదు. ఈ రోజు శవానికి కరోనా టెస్టు చేయబోతున్నారు.