Begin typing your search above and press return to search.

డాక్ట‌ర్ వీర్య‌దానం..50 మంది సంతానం..పోలీసు కేసు

By:  Tupaki Desk   |   21 March 2019 1:30 AM GMT
డాక్ట‌ర్ వీర్య‌దానం..50 మంది సంతానం..పోలీసు కేసు
X
ఇదొక నాన్న క‌థ‌! తండ్రిగా గుర్తింపు పొందిన త‌ర్వాత క‌ట‌క‌టాల పాలైన క‌థ‌. ఆయ‌న తండ్రిగా గుర్తింపు పొందిన త‌ర్వాత జ‌రిగిన ఆ ప‌రిణామానికి కార‌ణం అడ‌గకుండా చేసిన స‌హాయం. నిబంధ‌న‌ల మేర‌కు చేయ‌ని ఈ స‌హాయం వ‌ల్ల ఆయ‌న జైలుపాల‌య్యారు. అలా చేసింది ఓ వైద్యుడు. జైలు పాల‌య్యేందుకు కార‌ణం అయింది వీర్య‌దానం. నిబంధ‌నలు ఉల్లంఘించి వీర్య‌దానం చేయ‌డం వ‌ల్ల ఆయ‌న శిక్ష అనుభ‌వించాల్సి వ‌చ్చింది.

వివరాల్లోకి వెళితే...మ‌న‌కు ఇటీవ‌లి కాలంలో సుప‌రిచిత‌మైన అద్దె గ‌ర్భం లాగానే వీర్యదానంతో బిడ్డ‌కు జ‌న్మించ‌డం అనే విధానం కూడా ఉంది. అమెరికాలో ఇలా సంతానం పొందిన‌ వారెంద‌రో! ఇదిలాఉంటే, అమెరికాలో కొన్ని డీఎన్‌ ఏ వెబ్‌ సైట్లు ఉన్నాయి. ఇందులో ఆయా వ్య‌క్తులు త‌మ వివ‌రాలు పొందుప‌ర్చ‌వ‌చ్చు, త‌మ పుట్టుక‌కు సంబంధించిన వివ‌రాలు ఇత‌రుల‌తో పంచుకోవ‌చ్చు. ఈ త‌ర‌హాలోని ఓ వెబ్‌ సైట్ ద్వారా ఒకే డీఎన్ ఏ కలిగిన వారందరూ కలిసి ఓ గ్రూప్‌ గా ఏర్పడి తమ పుట్టుకకు కారణం ఒకరేనని తెలుసుకున్నారు.! దీంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం వారి వంత‌యింది. అందులో ఓ యువ‌తి త‌మ వివ‌రాల‌తో ఫేస్‌ బుక్‌ లో శోధించ‌గా...అలాగే ఉన్న‌వారి వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరప‌డిన వారంతా ఇలా ఓ కుటుంబంగా వారు త‌యార‌య్యారు. ఇలా ఎలా జ‌రిగింద‌ని ఆరాతీస్తే, వారు వైద్య చికిత్స పొందిన ఫెర్టిలిటీ కేంద్రం డాక్ట‌ర్ నిర్వాకం అని తేలింది.

1960 నుంచి 1970ల మధ్య సంతానోత్పత్తి కోసం మహిళలు సంప్రదించిన ఫెర్టిలిటీ ఆసుపత్రిలోని డాక్టర్ డొనాల్డ్ క్లైన్ అక్క‌డ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా త‌న వీర్య‌దానం చేసిన‌ట్లు తేలింది. దీంతో షాక్ తిన‌డం వారి వంత‌యింది. ఇలా ఇంకెంత‌మంది ఉన్నారో అంటూ తెలుసుకునే ప‌నిలో ప‌డ్డారు వీరంతా. డొనాల్డ్ క్లైన్ వీర్యం ద్వారా పుట్టిన పిల్లలు మరింత మంది ఉండే అవకాశముందని - డీఎన్ ఏ పరీక్షలు చేయించుకోని వారు కూడా చాలా మందే ఉన్న నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే...మ‌రికొంద‌రు తెర‌మీద‌కు వ‌స్తార‌ని అంటున్నారు. ఇక డాక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే - నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ఆ వైద్యుడికి ఏడాది పాటు జైలు శిక్ష విధించారు న్యాయ‌మూర్తులు.