Begin typing your search above and press return to search.
చావు ఇలా కూడా వస్తుందా? కారులో నుంచి తల బయటపెట్టినంతనే ప్రాణం పోయింది
By: Tupaki Desk | 22 Nov 2021 12:30 AM GMTచావు చెప్పి రాదని పెద్దలు చెబుతుంటారు. నిజమే.. పోయే ప్రాణం ఎప్పుడు.. ఎలా పోతుందో అస్సలు అర్థం కాదు. అంతేకాదు.. చావు ఎప్పుడూ తనను వేలెత్తి చూపించేందుకు అవకాశం ఇవ్వదంటారు. అందుకు తగ్గట్లే.. చనిపోయే ప్రతి మనిషి ఏదో ఒక కారణంతో మరణిస్తారు తప్పించి.. కారణం లేకుండా తుదిశ్వాస విడవటం ఉండదు.
మృత్యుదేవత ఎప్పుడు ముంచుకొస్తుందో తెలీదు. తాజా విషాద ఉదంతాన్ని చూస్తే.. చావు కూడా ఇలా వస్తుందా? అన్న విస్మయానికి గరి కాక తప్పదు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు రావులపాలెంలో జరిగే స్నేహితురాలి పెళ్లికి వచ్చారు. వీరంతా వల్లభనేని లోహిత్ రాణి సొంతూరు గౌరీపట్నంలో బస చేశారు.
లోహిత్ రాణితో పాటు మిగిలిన ఆరుగురు చెన్నైలో సీఏలుగా పని చేస్తున్నారు. మరో ఇద్దరు బీటెక్ చేశారు. స్నేహితురాలి పెళ్లి కోసం పశ్చిమగోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి ఒక కారులో మారేడుమిల్లి విహారయాత్రకు బయలుదేరారు.
మధురపూడి విమానాశ్రయం గేటు - బూరుగుపూడి గ్రామం మధ్య ప్రయాణిస్తున్న వేళ పాతికేళ్ల వల్లభనేని లోహిత్ రాణి వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో కారు కిటికి నుంచి తల బయటకు పెట్టారు. చల్లగాలిని అస్వాదిద్దామన్నఆమె ప్రయత్నం అనూహ్య విషాదానికి దారి తీసింది. కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది. ఊహించని షాక్ కు గురైన మిత్రులకు చేతులు కాళ్లు ఆడలేదు.
బలంగా విద్యుత్ స్తంభం తగలటంతో ఉలుకు పలుకు లేని ఆమెను అదే కారులో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తేల్చటంతో స్నేహితుల వేదనకు అంతు లేకుండాపోయింది. ఇక.. లోహిత్ రాణి తల్లిదండ్రులు ఇద్దరు అనారోగ్యంగా ఇబ్బందుల్లో ఉన్నారు.
ఇలాంటి వేళ.. వారికి ఒక్కగానొక్క సంతానమైన లోహిత్ రాణి అనూహ్య మరణం.. ఆ కుటుంబాన్ని కోలుకోలేని విషాదంలోకి నెట్టేసింది. ఈ ఉదంతం గురించి విన్నంతనే.. చావు ఇలా కూడా వస్తుందా? అన్న భావన కలుగక మానదు.