Begin typing your search above and press return to search.
మోడీ..సుష్మా..లేట్ చేయొద్దు..రియాక్ట్ కండి
By: Tupaki Desk | 13 Dec 2017 7:19 AM GMTఇరుగుపొరుగు దేశాలతో చెలిమి చేయటం చేతకాని దేశాల్లో చైనా ముందుంటుంది. ప్రతి ఒక్కరితో ఏదో ఒక పేచీతో ఆ దేశానికి సరైన మిత్రులు అంటూ ఎవరూ లేరు. ప్రభుత్వానికి తగ్గట్లే చైనా ప్రజలు.. కంపెనీలు కూడా అలాంటి తీరునే ప్రదర్శిస్తాయా? అన్న సందేహాం కలిగేలా తాజా ఉదంతం ఉందని చెప్పాలి.
అమెరికాకు చెందిన అంతర్జాతీయ రీటైల్ చైన్ లింక్ సంస్థ ఒకటి భారత చిత్ర పటానికి సంబంధించిన గ్లోబ్ ను విక్రయిస్తున్నారు. అయితే.. ఆ గ్లోబ్ లో కశ్మీర్ భాగాన్ని స్వతంత్య్ర ప్రాంతంగా .. అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో చూపిస్తూ తయారు చేశారు. అదేంట్రా బాబు అంటే..సమాధానం చెప్పని పరిస్థితి.
భారత భూభాగంలో ఉన్న ప్రాంతాల్ని వేరే దేశంలో అంతర్భాగం అన్నట్లుగా మ్యాపులు రూపొందించి.. వాటిని ఎంచక్కా అమ్మేస్తున్నారు. ఈ వివాదాస్పద గ్లోబుల్ని కెనడాలోని కోస్టాకోలో ఒక మాల్ లో అమ్ముతున్నారు. భారత్ లో అంతర్బాగమైన ప్రాంతాల్ని ఇలా తప్పుగా చూపించటంతో అక్కడ భారత మూలాలున్న వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ గ్లోబు కింద చూడగా.. మేడిన్ చైనా అని ఉందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలపై ప్రధాని మోడీ.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను వెంటనే స్పందించాలని కోరుతున్నారు. ఈ వివాదాస్పద గ్లోబ్ అమ్మకాలపై కెనడాలో స్థిరపడ్డ భారతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి.. సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటూ తక్షణమే స్పందించే అలవాటున్న మోడీ.. సుష్మలు ఈ ఇష్యూను టేకప్ చేయాల్సిన అవసరం ఉంది.