Begin typing your search above and press return to search.
పేదల విషయంలో చేతులెత్తేసిన కేంద్రం
By: Tupaki Desk | 21 Jun 2021 7:30 AM GMTకరోనా వైరస్ మృతులకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో నరేంద్రమోడి సర్కార్ చేతులెత్తేసింది. కరోనా కారణంతో చనిపోయిన ప్రతి రోగికి రు. 4 లక్షలు పరిహారం ఇవ్వటం సాధ్యం కాదని సుప్రింకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ పరిహారం ఇవ్వాల్సొస్తే ఎక్కడి నిధులు సరిపోవని కూడా చెప్పింది. మిగిలిన ప్రకృతి వైపరీత్యాలతో కరోనా వైరస్ ను పోల్చేందుకు అవకాశం లేదని స్పష్టంచేసింది.
ప్రకృతి వైపరీత్యాలకు కేంద్రం కేటాయించిన రు. 22,184 కోట్లు కూడా పరిహారాలకు సరిపోదని కేంద్రం చెప్పింది. తుపానులు, వరదల్లాంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇచ్చినట్లుగా కరోనా మృతులకు పరిహారం ఇవ్వలేమని చెప్పేసింది. ఎందుకంటే తుపానులు, వరదలు దేశంలో ఏదో ఓ ప్రాంతంలో ఎప్పుడో ఒకసారి సంభవిస్తుంది. కాబట్టి అప్పుడు మృతులకు పరిహారం ఇవ్వటంలో ఇబ్బంది లేదు.
కానీ ఇపుడు కరోనా వైరస్ అన్నది మొత్తం దేశాన్ని కబళించేస్తున్నట్లు గుర్తుచేస్తోంది. ఇంకా ఎంతమంది చనిపోతారో కూడా తెలీదని ఆందోళన వ్యక్తంచేసింది. అందుకనే పరిహారానికి ప్రత్యామ్నాయంగా రోగులకు సౌకర్యాలు, వైద్యసేవలు, లాక్ డౌన్ కాలంలో నిత్యావసరాలు, కొంత డబ్బు అందచేసిన విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే 3.85 లక్షల మంది చనిపోయిన వారికి పరిహారం ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ కేటాయించినా సరిపోదన్నది కేంద్రం.
ఒక విధంగా కోవిడ్ మృతుల పరిహారం విషయంలో కేంద్రం చెప్పింది సబబుగానే ఉంది. కానీ మృతుల కుటుంబాలను ఆదుకునే విషయంలో కేంద్రం ఏదోరూపంలో చొరవ చూపిస్తే బాగుంటుంది. కార్పొరేట్ సంస్ధలు బ్యాంకులకు ఎగొట్టిన అప్పులు, లేదా బ్యాంకులు రద్దు చేస్తున్న లక్షల కోట్లరూపాయలతో పోల్చితే కరోనా మృతులకు పరిహారం విషయంలో చొరవ చూపటంలో తప్పేలేదు.
కానీ ఈ విషయంలో నరేంద్రమోడికి మనసు రావటంలేదు. ఒకవైపు కార్పొరేట్లు సంస్ధలు తీసుకున్న వేల కోట్ల రూపాయలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొడుతున్నాయి. వాళ్ళనుండి అప్పులు రాబట్టడం బ్యాంకులకు చేతకావటంలేదు. మొన్నటికిమొన్ననే రు. 1.53 లక్షల కోట్ల అప్పులను రానిబకాయిల పద్దులో లెక్కేసి అన్నింటినీ రద్దుచేశాయి బ్యాంకులు. మరి ఒకవైపు లక్షల కోట్లరూపాయలను రద్దు చేస్తున్న కేంద్రం ఇదే సమయంలో లక్షలాది కుటుంబాలను ఆదుకునే విషయంలో చేతులెత్తేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.