Begin typing your search above and press return to search.
ఈ అప్డేట్ కు నోట మాట రాదంతే.. 14 మంది భార్యలు కాదట.. 17 మందట
By: Tupaki Desk | 18 Feb 2022 11:30 AM GMTరెండు రోజుల క్రితం ఒక వార్త పలు మీడియా సంస్థల్లో కవరైంది. అందరూ సదరు నిత్యపెళ్లికొడుకు 14 పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. డాక్టర్ అని చెప్పి మహిళల్ని మస్కా కొట్టే ఇతడి బారిన పడిన మహిళల్లో టీచర్లు.. లాయర్లు.. డాక్టర్లు.. ఇలా చాలామందే ఉన్నారు. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి.. మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకునేవాడు.
తాజాగా అతడు ఢిల్లీకి చెందిన ఒక టీచరమ్మను పెళ్లాడి.. భువనేశ్వర్ కు తీసుకురావటం.. ఆమె తాను మోసపోయిన వైనాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఇతగాడి గుట్టు రట్టైంది.
ఒడిశాకు చెందిన ఇతడు.. వరుస పెళ్లిళ్లు చేసుకోవటంతో పాటు.. ఉద్యోగాలు ఇప్పిస్తానని.. మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు దండుకొనేవాడు. తాజాగా ఒడిశాకు చెందిన ఒక విద్యార్థికి మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి రూ.18 లక్షలు తీసుకోవటం.. తాను మోసపోయినట్లు గుర్తించిన సదరు విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఇతడి పాపం పండి.. ఒకే సందర్భంలో రెండు కంప్లైంట్లు రావటంతో పోలీసులకు దొరికిపోయాడు.
ఇతడ్ని విచారించిన క్రమంలో పోలీసులకు షాకుల మీద షాకులు తిరిగాయి. నిందితుడు వరుస పెళ్లిళ్లతో పాటు.. ఆర్థిక లావాదేవీలు సైతం భారీ స్థాయిలో ఉండటంతో మరింత ఫోకస్ పెంచారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఇస్తున్న వివరాలు తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
ఇప్పటివరకు అతనికి 14 పెళ్లిళ్లు అయ్యాయనుకుంటే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 18 పెళ్లిళ్లు అయినట్లుగా తేల్చారు. షాకింగ్ అంశం ఏమంటే.. మొత్తం పద్దెనిమిది మందిని పెళ్లాడితే.. అందులో 14 రాష్ట్రాలకు చెందిన వారున్న విషయం బయటకు వచ్చింది.
ఇంత భారీ ఎత్తున వేర్వేరు రాష్ట్రాలకు చెందిన మహిళల్ని టోకరా కొట్టి వారిని పెల్లాడి.. వారి నుంచి కొంత డబ్బు తీసుకొని ఉడాయించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.