Begin typing your search above and press return to search.

అంతా ఊహించినట్టే.. కాంగ్రెస్‌కు ఆ రెండు పార్టీల భారీ దెబ్బ!

By:  Tupaki Desk   |   8 Dec 2022 8:35 AM GMT
అంతా ఊహించినట్టే.. కాంగ్రెస్‌కు ఆ రెండు పార్టీల భారీ దెబ్బ!
X
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో ఇప్పటికే బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీకి అవసరమైన 92 మార్కును అధిగమించింది. ఇంకా 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

బీజేపీ మొత్తం 182 స్థానాల్లో 150 సీట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు అధికారంలోకి వస్తుందనకున్న కాంగ్రెస్‌ పార్టీ కుదేలైంది. బీజేపీ ధాటికి దారుణంగా దెబ్బతింది. అయితే బీజేపీ కొట్టిన దెబ్బ కంటే కాంగ్రెస్‌ పార్టీని ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం పార్టీలే భారీగా దెబ్బతీశాయి.

2017లో గుజరాత్‌కు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి 20 సీట్ల లోపుకే పరిమితమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నాటికి కాంగ్రెస్‌ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించగా మరో 14 చోట్ల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.

వాస్తవానికి గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని గట్టిగా సొమ్ము చేసుకుని ఉంటే కాంగ్రెస్‌ సులువుగా అధికారం దక్కించుకునేది. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాయి. దీంతో బీజేపీ లాభపడింది.

సాధారణంగా ముస్లింలు కాంగ్రెస్‌ పార్టీకి సంపద్రాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈసారి ఎంఐఎం గుజరాత్‌లో పోటీ చేసి ముస్లింల ఓట్లను తన వైపునకు తిప్పుకుంది. అలాగే ఎస్సీలు, ఎస్టీలు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లుగా ఉండగా వారిని ఆమ్‌ ఆద్మీ పార్టీ తన వైపునకు లాగేసుకుంది. బీజేపీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం అనే భావనను గుజరాత్‌ వ్యాప్తంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ రేకెత్తించడంతో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది.

గత ఎన్నికల్లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి 20 సీట్ల లోపునకే పరిమితమవుతోంది. కాంగ్రెస్‌కు మొదటి నుంచి సంప్రదాయ ఓటర్లుగా ఉంటూ వస్తున్న ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింల ఓట్లను ఆమ్‌ ఆద్మీ పార్టీ, అసదుద్దీన్‌ ఒవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం కొల్లగొట్టాయి. దీంతో ఆ మేర కాంగ్రెస్‌ నష్టపోయింది.

ఎంఐఎం ఖాతా తెరవకపోయినా భారీగానే ఓట్లను చీల్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆప్‌ మూడు చోట్ల గెలుపొంది మరో రెండు చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది.

ఆప్, ఎంఐఎంలు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును చీల్చడంతో కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 60 దాకా సిట్టింగ్‌ స్థానాలకు కోల్పోవడం గమనార్హం. కాంగ్రెస్‌ ఓట్లను ఆప్, ఎంఐఎం పార్టీలు భారీగా చీల్చాయి. మరోవైపు ఆదివాíసీల ఓట్లు కూడా కోల్పోవడం కాంగ్రెస్‌కు మైనస్‌గా మారిందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.