Begin typing your search above and press return to search.
డిజిటల్ మీడియాకు భారీ ఊరట
By: Tupaki Desk | 15 Aug 2021 12:30 PM GMTకేంద్రప్రభుత్వం ఇటవల నోటిఫై చేసిన కొత్త ఐటీ చట్టం2021లో కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు శనివారం మధ్యంతర స్టే విధించింది. ఆన్ లైన్ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలని ఐటీ రూల్స్ లో పొందుపరిచిన సంగతి తెలిసిందే.
ఈ నిబంధనలపై హైకోర్టు మధ్యంతర స్టే ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. కొత్త ఐటీ చట్టంలోని క్లాజ్ 9 కింద పేర్కొన్న సబ్ క్లాజెస్ 1 అండ్ 3లపై స్టే విధిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఈ సబ్ క్లాజ్ లు పిటీషనర్ వాక్ స్వాతంత్ర్యపు హక్కును హరిస్తున్నట్టు తాము ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్టు తెలిపింది. వివాదాస్పద కొత్త ఐటీ నిబంధనల్లోని సబ్ క్లాజ్ లపై మధ్యంతర స్టే విధించింది.
కొత్త ఐటీ రూల్స్ లోని నిబంధనలను సవాల్ చేస్తూ లీగల్ న్యూస్ పోర్టల్ ‘ద లీఫ్ లెట్’, జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే బాంబే హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. పిటీషనర్ల వాదనతో ఏకీభవించింది. హైకోర్టు స్టేతో డిజిటల్ మీడియాకు భారీ ఊరట దక్కినట్టైంది.