Begin typing your search above and press return to search.
సూయజ్ కాలువలో భారీ నౌక కదిలింది
By: Tupaki Desk | 28 March 2021 10:50 AM GMTప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గం సూయజ్ కెనాల్ లో భారీ నౌక కొద్దిగా కదిలినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మానవ నిర్మిత కాలనీలో ఆరు రోజుల నుంచి చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌక ప్రయాణం మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమన్నారు.
సూయాజ్ కాలువ ఆథారిటీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఎవర్ గివెన్ నౌకను ప్రయాణానికి అనువుగా తిప్పేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. ఈ నౌక ఒక మూల నుంచి మరొక మూలకు చిక్కుకుపోవడంతో ప్రపంచంలో రద్దీగా ఉండే ఈ జలమార్గానికి ఆటంకం ఏర్పడిందని తెలిపారు.
ఇసుకను తవ్వి, టగ్ బోట్స్ తో లాగడం వంటి చర్యల ద్వారా శనివారం ఈ నౌకను కొద్దిగా కదిలించగలిగామని తెలిపారు. సుమారు 30 డిగ్రీల మేరకు కదిలిందని పేర్కొన్నారు. ఈ నౌక కింద నీటి ప్రవాహం మొదలైందని తెలిపారు. త్వరలోనే నౌక ప్రస్తుత ప్రదేశం నుంచి పూర్తిగా కదులుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
మంగళవారం ఇసుక తుఫాన్ తో ఈ ఎవర్ గివెన్ నౌక కాలువలో చిక్కుకుంది. దీంతో వందలాది నౌకలు అటు ఇటు ఆగిపోయాయి. ఇప్పటికే నౌక చుట్టు ఉన్న ఇసుకలో 20వేల టన్నుల ఇసుకను తొలగించారు. కాస్త కదిలించారు.