Begin typing your search above and press return to search.

స్విగ్గీకి భారీ షాక్.. డీల్ నుంచి 900 రెస్టారెంట్లు అవుట్

By:  Tupaki Desk   |   29 Oct 2022 6:36 AM GMT
స్విగ్గీకి భారీ షాక్.. డీల్ నుంచి 900 రెస్టారెంట్లు అవుట్
X
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కఠినమైన వ్యాపారాన్ని ఎంతో సింఫుల్ గా చేయటమే కాదు.. కోట్లాది రూపాయిల ఆధాయాన్ని ఎలా పొందొచ్చన్న విషయాన్ని కొన్ని యాప్ ఆధారిత సంస్థలు చేతల్లో చూపించటం తెలిసిందే. ఒక రెస్టారెంట్ ను నిర్వహించటం ఎంత కష్టసాధ్యమైన విషయమో తెలిసిందే. అలాంటిది అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఆధారంగా చేసుకొని వేలాది రెస్టారెంట్లను సింగిల్ హ్యాండ్ లో హ్యాండిల్ చేస్తూ.. వంట చేయకుండా వందల కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్న తెలివైన వ్యాపారంగా ఆగ్రిగ్రేటర్స్ ను చెప్పాలి.

తమ యాప్ ద్వారా వేలాది రెస్టారెంట్లను ఒక చోటుకు తీసుకొచ్చి.. వినియోగదారులు ఆయా రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ బుక్ చేసుకునేలా చేయటం.. ఆర్డర్ చేసిన ఫుడ్ ను డెలివరీ చేయటం ద్వారా.. రెస్టారెంట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్న సంస్థలుగా ఆగ్రిగేటర్లు నిలుస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో స్విగ్గీ.. జొమాటో లాంటి సంస్థలు ఉన్నాయి. స్విగ్గీకి చెందిన మరో యాప్ చేసే పనేమంటే.. పలు రెస్టారెంట్లలో డైన్ ఇన్ కోసం ముందస్తుగా బుక్ చేసుకుంటే.. భారీ డిస్కౌంట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి యాప్.. డైన్ అవుట్.

కోవిడ్ తర్వాత రెస్టారెంట్ల వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో.. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆగ్రిగేటర్లు భారీ ఎత్తున ఆపర్లు.. డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. దీంతో.. ఆయా రెస్టారెంట్ల ఆదాయం భారీగా తగ్గిపోతోంది. దీంతో.. వారి సమస్యల పరిష్కారానికి రెస్టారెంట్ బాడీ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ.. జొమాటో.. స్విగ్గీ లాంటి ఆన్ లైన్ పుడ్ సంస్థలతో చర్చలు జరిపింది.

ఆగ్రిగ్రేటర్లు ఇస్తున్న డిస్కౌంట్ల కారణంగా తమ ఆదాయానికి గండి పడుతోందని.. రెస్టారెంట్లు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల యజమానులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆగ్రిగేటర్లు ఇస్తున్న రాయితీలకు మంగళం పాడటంతో పాటు.. వారితో వ్యాపారం చేయటం కుదరదన్న విషయాన్ని తేల్చేశారు. ఇందులో భాగంగా స్విగ్గీకి చెందిన డైన్ అవుట్ యాప్ లో భాగస్వామ్యం ఉన్న 900 రెస్టారెంట్లు తాజాగా తాము చేసుకున్న ఒప్పందం నుంచి బయటకు వచ్చేసి షాకిచ్చాయి.

ఇంతకాలం భారీగా ఉన్న సంస్థల అండగా చెలరేగిపోయిన ఈ సంస్థకు.. తాజాగా ఒక్కో రెస్టారెంట్ ను తమ జాబితాలోకి చేర్చుకోవటం భారీ శ్రమతోకూడుకున్నదని చెబుతున్నారు. లాభం మొత్తం తమకే రావాలన్నట్లుగా వ్యాపారం చేస్తే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. దీనికి స్విగ్గీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.