Begin typing your search above and press return to search.

బిల్లు కట్టలేక , భార్య శవాన్ని భర్త ఏంచేసాడంటే ?

By:  Tupaki Desk   |   10 Oct 2020 11:30 PM GMT
బిల్లు కట్టలేక , భార్య శవాన్ని భర్త ఏంచేసాడంటే ?
X
కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మరణిస్తే బిల్లు కట్టేదాకా ఆ వ్యక్తి శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించరనే విషయం తెలిసిందే. కొన్ని కార్పొరేట్ హాస్పటల్స్ అయితే బిల్లు మొత్తం కట్టేదాకా, రోగి చనిపోయిన విషయం కూడా కుటుంబ సభ్యులకు తెలియచేయవు. అయితే , అన్ని హాస్పిటల్స్ ఇలానే ఉంటాయా అంటే చాలా వరకు ప్రస్తుత రోజుల్లో ఈ తరహా హాస్పిటల్స్ ఉన్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి లో చోటుచేసుకుంది. అయితే, హాస్పిటల్ బిల్లు కడితేనే శవాన్ని ఇస్తాం అని హాస్పిటల్ వర్గాలు చెప్పలేదు. కానీ, బిల్లు కట్టలేక ఓ వ్యక్తి భార్య శవాన్ని హాస్పిటల్ లోనే వదిలేశాడు. ఈ ఘటన తిరుపతిలోని స్విమ్స్‌లో జరిగింది. కడప జిల్లాకు చెందిన వివాహిత తీవ్ర అనారోగ్యంతో స్విమ్స్‌లో అడ్మిట్‌ అయింది. ఆ మరుసటి రోజే పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. అయితే ఆసుపత్రి బిల్లు 30 వేలు తీసుకొస్తానని భర్త అక్కడి నుంచి మాయమయ్యాడు. భార్య మృతదేహాన్ని ఆసుపత్రిలోనే వదిలేశాడు. ఆ తరువాత తిరిగిరాలేదు. విషయాన్ని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు స్విమ్స్‌ అధికారులు. ఆధార్‌, రేషన్‌ కార్డులు కూడా నకిలీవని తేలింది. దాంతో దీనిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.