Begin typing your search above and press return to search.
కొంపముంచిన ‘వర్క్ ఫ్రం హోమ్' ..లైవ్ లో అర్ధనగ్న ప్రదర్శన!
By: Tupaki Desk | 1 May 2020 12:30 AM GMTకరోనా దెబ్బకి ఇప్పుడు 100 లో 99 మంది ‘వర్క్ ఫ్రం హోమ్' చేస్తున్నారు. వినడానికి ఈ వర్క్ ఫ్రం హోమ్ బాగానే ఉన్నా కూడా చేసేవారికి పులుసు కారిపోతుంది. వాస్తవానికి వర్క్ ఫ్రం హోమ్ కంటే ఆఫీసులో పనిచేయడమే అత్యంత తేలికైనా పని. ఎందుకంటే.. ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో డిస్టబ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీడియో కాల్స్ లో బాసులతో మాట్లాడేప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. ఉద్యోగితోపాటు ఇంట్లోవాళ్లు కూడా చక్కగా దుస్తులు ధరించాలి. లేకపోతే.. ఈ రిపోర్టర్ కు ఎదురైన పరిస్థితే అందరికి ఎదురౌతుంది.
అసలేమైంది అంటే .. స్పెయిన్ కు చెందిన జర్నలిస్ట్ అల్ఫాన్సో మెర్లోస్ వర్క్ ఫ్రం హోమ్ నేపథ్యంలో ఇంటి నుంచి లైవ్‌లో సమాచారం అందిస్తున్నాడు. మరో జర్నలిస్ట్ జవియర్ నెగ్రే నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ అలారం అనే యూట్యూబ్ చానెల్‌లో మెర్లోస్ గెస్టుగా మాట్లాడాడు. ఆ సమయంలో అతడి వెనకాల నుంచి లోదుస్తులు మాత్రమే ధరించిన యువతి అర్థనగ్నంగా నడుచుకుని వెళ్లడం కనిపించింది. ఆమెను వీడియోలో చూసిన నెగ్రే వెంటనే అతడని అప్రమత్తం చేశాడు. కానీ, అప్పటికే జరగాల్సింది మొత్తం జరిగిపోయింది.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. మరో చేదు నిజం ఏమిటంటే.. ఆ వీడియోలో ఉన్న యువతి అతడి భార్య మార్తా లోపెజ్ కాదట. ఆమె ఓ స్పెయిన్ కు చెందిన ఓ టీవీ రిపోర్టర్ అలెక్సియా రివాస్ అని తెలిసింది. ఆ జర్నలిస్టు భార్య మరెవ్వరో కాదు.. బిగ్ బ్రదర్ షో మాజీ కంటెస్టెంట్ మార్తా లోపెజ్. ఈ వీడియో చూసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇక అతడితో కలిసి జీవించేది లేదని, అతడి నుంచి విడిపోతున్నానని తెలిపింది, ఏదేమైనా మోతంగా ఈ వర్క్ ఫ్రం హోమ్ ఓ జంటను విడదీసింది.